ఆదివారం 09 ఆగస్టు 2020
Sunday - Jul 12, 2020 , 01:18:47

పక్కా లోకల్‌.. ‘ఖేడ్‌ సుశీల!’

పక్కా లోకల్‌.. ‘ఖేడ్‌ సుశీల!’

పూరీ.. వడ.. దోశ.. ఉప్మా ఇవే కదా మనకు హోటల్‌ మెనూలో కనిపించే పేర్లు. కానీ.. ఒక ప్రాంతంలో మహిళ పేరు కనిపిస్తుంది. అదేంటీ.. అని అందరూ నోరెళ్లబెట్టేలోపే అసలు విషయం తెలుస్తుంది. ఓస్‌నీ.. ఇంతేనా? అనుకోవడం ఖాయం.

ఎప్పుడైనా నారాయణ్‌ఖేడ్‌ వెళ్లారా? వెళ్తేమాత్రం సుశీలను మిస్‌ కాకండి. కొత్తవాళ్లు ఇక్కడి హోటల్స్‌ మెనూలో సుశీల పేరు చూసి ఆశ్చర్యపోతుంటారు. సుశీల అంటే అల్పాహారం పేరు. దశాబ్దాల నుంచి ఇది నారాయణ్‌ఖేడ్‌కు పేటెంట్‌గా మారింది. మంచి రుచి.. నాణ్యత వల్ల రోజురోజుకూ సుశీలకు ఆదరణ లభిస్తున్నది. ఇదొక పేలాలతో తయారుచేసే అల్పాహారం. పేలాలను నీటిలో తడిపి తాలింపు వేస్తారు. ఉల్లిపాయలు.. పల్లీలు.. పుట్నాలతో పాటు వివిధ రకాల పొడులు కలుపుతారు. ప్లేట్‌ సుశీల ధర రూ.10-15 మాత్రమే. తేలికైన ఆహారం.. రుచి బాగుండటం.. త్వరగా జీర్ణం అవుతుండటం సుశీల ప్రత్యేకత. కర్ణాటకలో చాలాచోట్లా లభించే ఈ సుశీల.. తెలంగాణలో ఒక్క నారాయణ్‌ఖేడ్‌లో మాత్రమే దొరుకుతూ ‘ఖేడ్‌ సుశీల’గా ఫేమస్‌ అయ్యింది. 


logo