బుధవారం 05 ఆగస్టు 2020
Sunday - Jul 04, 2020 , 23:39:15

ట్విట్టర్.. క్విట్టర్స్!

ట్విట్టర్.. క్విట్టర్స్!

అభిమానుల కోసం సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చివరికి వాళ్లకే చిక్కులు తెస్తున్నాయి. కొన్నిసార్లు పోస్టులు పెట్టినా, పెట్టకపోయినా   పంచాయతీయే. ఒక్కోసారి చిన్న అచ్చుతప్పు పడినా.. నెటిజన్లు చేసే ట్రోల్స్  తలలు పట్టుకునే పరిస్థితి వస్తున్నది.  ఆ గోల నుండి తప్పించుకునేందుకు ఏకంగా సోషల్ మీడియా నుంచే వైదొలగుతున్నారు. 

డీయాక్టివేట్ చేస్తున్నా..-సోనాక్షి సిన్హా


‘మనశ్శాంతిని కాపాడుకోవడానికి ట్విటర్ అకౌంట్ డీయాక్టివేట్ చేస్తున్నాను.  ఇంకెక్కడా ఇంత నెగెటివిటీ ఉండదు’ అంటూ బైబై చెప్పింది సోనాక్షి. ఇప్పటి వరకు తను ట్విటర్ అకౌంట్ 1320 పోస్టులు చేసింది. మొత్తం 18.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

బ్రేకప్ విత్ ట్విటర్- సాకీబ్ సలీం


‘మొదటిసారి ట్విటర్ ఖాతా తెరిచినప్పుడు భావాలను వ్యక్తపరిచేందుకు, జ్ఞానాన్ని సముపార్జించేందుకు,  విభిన్న దృక్పథాలను అర్థం చేసుకునేందుకు ఇదో గొప్ప వేదికగా కనిపించింది. కానీ కొన్ని రోజులుగా  ఇతరుల మనోభావాలను దెబ్బతీయడానికే ట్విటర్ ఉపయోగిస్తున్నారు. ఇక్కడి నుంచి బయటికి వెళ్లినా ఇతర సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు అందుబాటులో ఉంటాను’ అంటూ వీడ్కోలు తీసుకున్నాడు నటుడు సాకీబ్ సలీం. 

అందుకే నిష్క్రమిస్తున్నా- గాయకురాలు నేహా కక్కర్


‘ద్వేషం, అసూయ పెచ్చుపెరిగిపోతున్న కారణంగా.. కొన్నాళ్లు  దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.  ఎప్పటి నుంచో నాపై ట్రోలింగ్ నడుస్తున్నది. కానీ ఎప్పుడూ చెప్పుకోలేకపోయాను’ అంటారు నేహా. తనకు 39.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 

గుడ్-ఆయుష్ శర్మ


‘ట్విటర్ ఒకమ్మాయి నన్ను ఎగతాళి చేయడం, అవమానించడం బాధకలిగించింది. ఇలాంటి ట్రోల్స్ నేను వ్యతిరేకం. బహిరంగ వేదికపై ఏమైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ కించపరచకూడదు. అందుకే ట్విటర్ నుంచి విరామం తీసుకున్నాను’ ఇదీ ఆయుష్ వీడ్కోలు స్టేట్

సెలవు..-శశాంక్ ఖైతాన్, ఫిల్మ్ మేకర్


 ‘నా ట్విటర్ ఖాతాను  తొలగించాను. కానీ, అభిమానుల కోసం ఇదో మంచి ప్లాట్ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్నీ గౌరవిస్తాను. అందర్నీ నమ్ముతాను. ప్రేమనూ, ఆనందాన్నీ విస్తరించేందుకు సోషల్ మీడియా ఓ  శక్తిమంతమైన సాధనంగా అభివృద్ధి చెందాలి. ప్రశాంతమైన ప్రపంచం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తూ..’ అంటూ గుడ్ చెప్పారు శశాంక్.


logo