బుధవారం 05 ఆగస్టు 2020
Sunday - Jul 04, 2020 , 22:40:13

ఈ వారం మీ రాశి ఫలాలు

ఈ వారం మీ రాశి ఫలాలు

మేషం:ఇష్టకార్య సిద్ధి, మానసిక - శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులు ఇంటికి రావడం, వస్తువులను కొనడం, ఇతరుల వలన  పొందడం జరగవచ్చు. కీరిప్రతిష్ఠలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ సన్మానాలు ఉంటాయి. ఆఫీసులో అధికారుల ప్రశంసలు, ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు మంచి వేతనంతో కూడిన  ఆకర్షణీయమైన ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యాపార ఒప్పందాలు సఫలీకృతమవుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు. అత్యాశకు దూరంగా ఉండాలి.  ఖర్చులు నియంత్రించండి. చిన్ననాటి స్నేహితులను  కలుసుకొంటారు. పురాణ ప్రవచనాలపై  మనసు నిల్పుతారు. రాజకీయ,కోర్టు పనులలో ఖర్చు. అపరిచితులతో జాగ్రత్త వహించాలి.

వృషభం:పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంగా  ఉంటారు. వారం ప్రారంభంలో ఉద్యోగంలో చిన్న అవాంతరాలు  ఉండవచ్చు. కొత్త స్నేహితులను కలుసుకోవచ్చు. అధికారుల ఆదరణ, ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన వాయిదా వేసుకోండి. ఉత్సాహంగా కష్టించి  పనిచేస్తారు. ధనలాభం, కార్యఫలితాలు  సానుకూలం. క్రయవిక్రయాలతో లాభం. నూతన వస్త్రప్రాప్తి, డబ్బు విషయమై జాగ్రత్త అవసరం. సంబంధంలేని  విషయాల్లో తలదూర్చవద్దు. పెట్టుబడులను కొంతకాలానికి వాయిదా వేసుకోండి. ధార్మిక కార్యక్రమాల్లో ఆటంకాలు. వివాహాది శుభకార్యాల్లో ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలి. ప్రయత్న కార్యాలు చెడిపోకుండా జాగ్రత్త పడాలి.

మిథునం:సంపాదనకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ తప్పనిసరి. విలాసవస్తువులు కొంటారు. ప్రియమైన వారికి సహాయపడతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారంలో అభివృద్ధి. రాజకీయ కోర్టు వ్యవహారాలు కలిసివస్తాయి. ఆహారానియమాలను పాటించాలి. అభీష్ట కార్యసిద్ధి, అర్థంలేని విషయాల కోసం తగాదాలు, ఆర్థిక సమస్యలు ఉండవచ్చును. డబ్బు ఇవ్వడంలో, తీసుకోవడంలో జాగ్రత్త. దూరప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆర్థిక ఒప్పందాలు జాగ్రత్తగా చేయాలి. ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలి. ఉన్నతవిద్యకు అనుకూలత ఉంటుంది. పనులలో అవరోధం, ఆలస్యం ఉండవచ్చు. వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంటుంది. 

కర్కాటకం:వారం ప్రథమార్థంలో అన్నింటా అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. స్త్రీలకూ అనుకున్నవి కలిసివస్తాయి. రావలిసిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అన్ని వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార లావాదేవీలలో సమయస్ఫూర్తి కావాలి. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. అన్నదమ్ములు, స్నేహితులతో చర్చలకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. సంగీత సాహిత్య రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ, కోర్టుకేసుల్లో జాప్యం ఉండవచ్చు. ఉద్యోగంలో పై అధికారులతో సామరస్యంగా ఉండాలి. తోటివారితో చికాకులు ఉండవచ్చు.

సింహం:ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితులు, ఆత్మీయుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగ వివాహ  ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, కోర్టు పనుల్లో విజయం. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌ వ్యాపారులకు మంచిది. డబ్బు విషయమై జాగ్రత్త. స్నేహితులు, బంధువులతో అనుబంధాలు పెంచుకోవాలి. ప్రయాణాలవల్ల చాలా పనులు నెరవేరుతాయి. పిల్లల చదువు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుభవజ్ఞుల   సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సంతృప్తి ఉంటుంది. సహనంతో పనులు చేస్తారు. పనివారిలో చాలా మార్పు వస్తుంది. రావలిసిన డబ్బు చేతికి వస్తుంది.

కన్య:బంధుమిత్రులతో స్నేహపూర్వకంగా ఉండాలి. అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. వివాదాలకు  దూరంగా ఉండండి. చదువులు, శుభకార్యాల్లో తొందర పాటు నిర్ణయాలొద్దు. స్థిర, చర ఆస్తుల క్రయ విక్రయాలను వాయిదా వేసుకోవాలి. కావలసిన వస్తువులను కొంటారు. ప్రారంభించిన నిర్మాణపు పనులు  చిన్న ఆటంకాలతో ఆలస్యంగా   పూర్తవుతాయి. రాజకీయ పరమైన సహాయం లభిస్తుంది. వ్యాపారం, ఆర్థిక ఒప్పందాల్లో జాగ్రత్త. పనుల్ని సహనంతో చేస్తే  అనుకూల ఫలితాలు ఉంటాయి. పరిస్థితులను  అనుకూలంగా మార్చుకునే స్వభావం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరించేముందు బాగా ఆలోచించాలి. కొత్తపనులను వాయిదా వేసుకోవడం అన్నివిధాలా మంచిది.

తుల:వారం ప్రారంభంలో  ప్రతికూలత. క్రమేపి తాత్కాలికంగా కలిసివస్తుంది. లాభాపేక్ష లేకుండా పనులను పూర్తిచేసుకోవాలి. సమయస్ఫూర్తి వల్ల ప్రయోజనాలు ఉంటాయి. క్రయ విక్రయాలు, పెట్టుబడులలో జాగ్రత్త వహించాలి. ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ఉంటే కార్యసాఫల్యత. శ్రద్ధతో పనులు చేయాలి. రాజకీయ పనులు, కోర్టు కేసుల్లో వృథా ఖర్చులు. డబ్బులు చేతికి రావడంలో ఇబ్బంది. ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం ఉండవచ్చు. గ్రంథపఠనం, పురాణ శ్రవణంపై మనసు నిల్పుతారు. భార్యా పిల్లలతో గడుపుతారు. అన్నదమ్ములు, స్నేహితులతో ఆప్యాయంగా ఉంటారు. పైచదువుల విషయంలో తాత్కాలికంగా  ఆటంకాలు ఉండవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దైవ చింతన మనోబలాన్ని ఇస్తుంది. 

వృశ్చికం:వారం ప్రారంభంలో  అనుకూలంగా  ఉండి, చివరిలో  ఖర్చులు ఉండవచ్చు. పిల్లల చదువు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతాగురుభక్తి పెరుగుతుంది. మంచివారితో స్నేహం చేయాలి. డబ్బు సకాలంలో అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విందులూ వినోదాలకు దూరంగా ఉండాలి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. వ్యవసాయదారులకు రాబడి. సుదీర్ఘ చర్చలకు వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చులను నియంత్రణలో ఉంచుకుంటారు. పొదుపునకు అనుకూలమైన వారం. అన్ని విషయాల్లో సంతృప్తి ఉంటుంది. 

ధనుస్సు:అన్ని గ్రహాలు  ప్రతికూలంగా ఉన్నాయి.  అన్ని పనులలో  జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా జాగ్రత్త వహించాలి. ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి. వృత్తిలో ఉన్నవారికి పనులలో  ఆలస్యం ఉండవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. కొత్త పనులు చేపట్టకుండా, పాత పనులను పూర్తిచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. పెద్దల సలహాలకు  ప్రాధాన్యమివ్వండి. రాజకీయ, కోర్టు కేసుల్లో  ఒప్పందాలు చేసుకోండి. వాహనాల రిపేర్లు, ఆస్తులు క్రయ విక్రయాల్లో అప్రమత్తత అవసరం. విద్యార్థులు శ్రమించాలి. మంచివారితో స్నేహం  పెరుగుతుంది. పనులలో ఆలస్యం ఉండవచ్చు. ఓపిక అవసరం.

మకరం:వ్యాపారంలో లాభాలు, సలహాలు సంప్రదింపులతో మంచి ఫలితాలు ఉంటాయి. సామరస్య ధోరణితో చాలా పనులు  కలిసివస్తాయి. పనుల ఒత్తిడితో మానసిక  ఇబ్బంది ఉండవచ్చు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పనులలో మార్పులు జరుగుతాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. భార్యపిల్లలతో హాయిగా ఉంటారు. సంగీతం, సాహిత్యం, పురాణ శ్రవణంపై మనసు నిలుపుతారు. వాహనాల వలన పనులు నెరవేరుతాయి. పనివారితో ఇబ్బందులు దూరం. శుభకార్యాలతో ఖర్చులు, రాజకీయ కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలం. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు ఉంటాయి.

కుంభం:శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ  ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృథా ఖర్చులు ఉండవచ్చు. పనులు సకాలంలో  పూర్తవుతాయి. వస్తు, ద్రవ్య రూపేణా సహాయం చేస్తారు. విద్యార్థులు చాలా మంచిఫలితాలు పొందుతారు. పురాణ శ్రవణం, ఆధ్యాత్మికతపైన  మనసు నిలుపుతారు. కుటుంబ సభ్యులతో సుఖంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. నిర్మాణ రంగం, వ్యాపారం లో ఉన్నవారు లాభాలను గడిస్తారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. పనులు పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం.  మంచి ఫలితాలను పొందుతారు. బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలు అవసరం.

మీనం:స్వయం కృషితో పనిచేస్తారు. ఫలితాలు  అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో  అభిప్రాయ భేదాలుంటాయి. రాజకీయ, కోర్టు పనులలో అనుకూలం. చేతివృత్తి, వ్యాపారాల్లో లాభాలు. వాహనమూలకంగా పనులు కలిసివస్తాయి. పెట్టుబడుల వల్ల లాభాలు. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు.వస్తువులను కొనడానికి అనుకూలం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండాలి. శుభకార్యప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రణాళికతో  పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు.


logo