బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 00:55:17

బగ్‌ వేటగాడు

బగ్‌ వేటగాడు

ప్రతిభ ఏ ఒక్కరి సొంతంకాదు. దానికి పరిమితులూ లేవు. నేటి సమాజంలో టాలెంట్‌ ఉన్నోడిదే రాజ్యం. టెక్నాలజీలో నైపుణ్యం ఉంటే చాలు, కూర్చున్నచోటే డబ్బు  సంపాదించవచ్చు. ఆ ధైర్యంతోనే లక్షలు సంపాదిస్తున్నాడు ఓ కేరళ యువకుడు. ఇంతకూ అతను చేస్తున్నదేమిటంటే... సోషల్‌ యాప్‌లలో లోపాలను గుర్తించడం.

హ్యాకర్లు యాప్‌లలో బగ్‌లను ప్రవేశపెట్టి ఫోన్లను క్రాష్‌ చేస్తారు. దీంతో వినియోగదారుల ఫోన్‌లు పనిచేయకుండా పోతాయి. దీన్ని ప్రతీష్‌ గుర్తించడమే కాకుండా, ఈ విషయాన్ని గూగుల్‌ దృష్టికి కూడా తీసుకువెళ్తాడు. దాని పనితీరు, దానివల్ల జరిగే నష్టాన్ని సాక్ష్యాలతో నిరూపించాడు. దీంతో ప్రతీష్‌ ప్రతిభను గుర్తించిన గూగుల్‌  10 వేల డాలర్ల రివార్డును అందించింది. 

ఆండ్రాయిడ్‌, వాట్సాప్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికల్లో లోపాలను గుర్తించడమే తన ఉపాధిగా మలుచుకున్నాడు కేరళకు చెందిన ప్రతీష్‌ నారాయణ్‌. తను ప్రస్తుతం బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఎర్నాకులంకు చెందిన ప్రతీష్‌ ఆండ్రాయిడ్‌లో బగ్‌లను గుర్తించి వాటిని గూగుల్‌ దృష్టికి తీసుకెళుతున్నాడు.  టెక్నాలజీ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నదో, అంతే వేగంగా దానిని వక్ర మార్గం పట్టించడానికి కొందరు జాదూగాళ్లు  పన్నాగాలు పన్నుతున్నారు. అలాంటివాళ్ల ఆట కట్టించడమే లక్ష్యంగా ప్రతీష్‌ నారాయణ్‌ ముందుకు సాగుతున్నాడు. ఒక రకంగా చెప్పాంటే  ప్రతీష్‌ నారాయణ్‌ ఇప్పుడు బగ్‌ వేటగాడు! హ్యాకర్లు యాప్‌లలో బగ్‌లను ప్రవేశపెట్టి ఫోన్లను క్రాష్‌ చేస్తారు. దీంతో వినియోగదారుల ఫోన్‌లు పనిచేయకుండా పోతాయి. దీన్ని  గుర్తించడమే కాకుండా, ఈ విషయాన్ని గూగుల్‌ దృష్టికి కూడా తీసుకువెళ్తాడు. దీంతో ప్రతీష్‌ ప్రతిభను గుర్తించిన గూగుల్‌ 10 వేల డాలర్ల రివార్డును అందించింది. ఇలాంటి నజరానాలు అందుకోవడం ఇదే ప్రథమం కాదు. ఇప్పటికీ మొత్తం 13 బగ్‌లు కనుగొన్నాడు. వాట్సాప్‌లో అత్యధికంగా 9 లోపాలు, గూగుల్‌లో 3, మైక్రోసాఫ్ట్‌ గిట్‌ హబ్‌లో ఒక లోపం గుర్తించాడు. భవిష్యత్తులో దీన్నే ఉపాధిగా మలుచుకుంటానని ప్రతీష్‌ చెబుతున్నాడు. తను ఇటీవలే ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో ఓ బగ్‌ను గుర్తించి రూ.7.6 లక్షల నజరానా అందుకున్నాడు. ప్రపంచంలో ఏదో ఒక మూలన ఉన్న హ్యాకర్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లను ఎప్పటికీ పనిచేయకుండా నాశనం చేయగలడని ప్రతీష్‌ నిరూపించాడు. 


logo