బుధవారం 03 మార్చి 2021
Sunday - Feb 13, 2021 , 20:28:41

చిట్టి కథ

చిట్టి కథ

వీక్‌ సిగ్నల్స్‌

రోజూ సాయంత్రం ఐదు గంటలకు. ఆమె చెట్టు దగ్గరికి వస్తుంది.. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కోసం. అతనూ చెట్టు దగ్గరికి వస్తాడు.. ఆమె కోసం. వన్‌సైడ్‌ లవ్‌ స్టోరీ ప్రారంభం.

కృష్ణానగర్‌ చౌరస్తా

‘మా ఊరోడే బాబూ! సినిమాలంటే పిచ్చి.పని చేస్తానంటే తీసుకొచ్చాను’కొత్త కుర్రాడి చేతినుంచిచాయ్‌ కప్పు అందుకుంటూ..ప్రశ్నార్థకంగా చూసిన హీరోకు డైరెక్టర్‌ వివరణ.ఆ పిల్లగాడి కండ్లలోకసిని గమనించాడు హీరో. రేపటి రాజమౌళి తయార్‌! 

టీచరమ్మ!

ఏదైనా సరే.. పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకునే స్కూల్‌ టీచర్‌ని నేను. క్లాసులో తేడా వస్తే కళ్లెర్రజేస్తాను. ఇంట్లో మాత్రం.. ఆ చిట్టిచేతులు గీసే వంకర టింకర గీతలు  అద్భుతంగా అనిపిస్తాయి. నేనిప్పుడు.. టీచర్‌.. అమ్మని! 

జాయింట్‌ అకౌంట్‌

‘నా సంపాదనతో ఓ సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌కొనగలను. నీ సంపాదనతో నువ్వూ అంతే!ఇద్దరం కలిసి డబుల్‌ బెడ్‌రూమ్‌తీసుకుంటే..’ - సహోద్యోగికి ఓ అకౌంటెంట్‌ ‘పక్కా లెక్కల’ ప్రేమ ప్రతిపాదన.

భ్రమణ కాంక్ష

బతికున్నంత కాలం భర్త, పిల్లలు, చుట్టాలు.. చాకిరితోనే సరిపోయేది. కానీ, ఇప్పుడు..ప్రపంచాన్నంతా చూస్తున్నా!ఓ యాత్రికురాలికి నేత్రదాతగా!

VIDEOS

logo