ఆరుగాలం శ్రమించినా, రైతన్న తన కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నాడు. కాయకష్టం చేసే శక్తి ఉన్నా, భూదేవికి మించిన ఓపిక ఉన్నా.. వేసిన పంటలే వేస్తూ చేతులు కాల్చుకుంటున్నాడు. కర్షక లోకానికి కొత్తదారి చూపే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని తెచ్చారు గ్రంథకర్త ఎస్.కె.ఎమ్.పాషా. రైతుల ఇంట కాసుల వర్షం కురిపించే లక్ష్యంతో ‘అగర్వుడ్’ సాగు విధానాలను సవివరంగా ఇందులో పొందుపరిచారు. ఏ సమయంలో విత్తనాలు నాటాలి, మొక్కలను ఎలా సంరక్షించాలి, చెట్లను ఎలా కాపాడుకోవాలి, కలపను వాణిజ్యం చేసుకునే పద్ధతులేమిటి అన్నది ఈ పుస్తకంలో ప్రస్తావించారు. అగర్వుడ్ (ఊద్) చెట్లకు ఉన్న డిమాండ్‌ను తెలియజేశారు. తెలుగులో మొట్టమొదటిసారిగా అగర్వుడ్ సాగు, సేంద్రియ పద్ధతులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి సవిస్తారంగా పేర్కొన్నారు.
అగర్వుడ్ చెట్ల పెంపకం
(మహాగని చెట్లసాగుతో సహా)
రచన: ఎస్.కె.ఎమ్.పాషా
పేజీలు: 192, వెల: రూ.250
ప్రతులకు: ద పయనీర్ అసోసియేషన్
11-218, మసీదు వీధి, సారపాక
బుర్గంపహాడ్, భద్రాచలం- 507128
ఫోన్: 63019 54084