మేషం
వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది. గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. పాత బాకీలు కొంత వరకు వసూలు అవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో అందరి సహకారం లభిస్తుంది. బరువుబాధ్యతలు పెరిగినా పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. వ్యాపారులకు మంచి కాలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త దుస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంగీత కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయమూ పెరుగుతుంది.
వృషభం
సహోద్యోగుల సహకారం, పై అధికారుల ఆదరణ పొందుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఏకాగ్రత అవసరం. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రులు, పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికస్థితి స్థిరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూల సమయం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయ పరమైన సమస్యలను అధిగమిస్తారు. ఈ వారం ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థులకు కలిసివస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలున్నాయి.
మిథునం
వ్యాపారులకు ఈ వారం అనుకూలం. అయితే కొత్త పెట్టుబడులు కొంత కాలం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరగవచ్చు. అనవసరమైన ఆలోచనల కారణంగా కాలయాపన చేస్తారు. ఏకాగ్రత అవసరం. వాహనాల విషయంలో ఖర్చులు ముందుకు వస్తాయి. ఇంట్లో పెద్దవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు పెడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయంలో అస్థిరత, హెచ్చుతగ్గులు ఉంటాయి. కుటుంబ
సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు పట్టుదలతో చదివి మంచిస్థాయిలో నిలుస్తారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు.
కర్కాటకం
ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూలం. మంచిస్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతితో బదిలీ అయ్యే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం, భూముల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. అయితే, ఆర్థిక లావాదేవీలలో ఏమరుపాటు తగదు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
సింహం
బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. కార్య సాఫల్యం ఉంది. స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. విహార యాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రాజకీయ పనులు నెరవేరుతాయి. కోర్టు పనులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో తోబుట్టువులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది.
కన్య
వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల వారం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పెంపొందుతాయి. కొన్ని అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వాహనాల వల్ల ఖర్చులు పెరగొచ్చు. భూముల వ్యవహారంలో అయినవారితో మనస్పర్ధలు రావచ్చు. కోర్టు కేసుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. అయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. పట్టుదల అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి.
తుల
ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉండవచ్చు. పట్టుదల అవసరం. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు భాగస్వాములతో అవగాహన పెంపొందించుకుంటారు. స్నేహితులు, బంధువర్గం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. కొత్త పరిచయాలతో కొన్ని పనులు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల సమయం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది.
వృశ్చికం
బంధువర్గం మూలంగా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు కార్యస్థలంలో తోటివారి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. పై అధికారులతో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమంగా పెరుగుతుంది. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సమయానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటారు.
ధనుస్సు
ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంగా ఉంటూ, సంతోషంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. తలపెట్టిన పనులలో బరువు, బాధ్యతలు పెరిగినా సంతోషంగా పూర్తి చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
మకరం
కళాకారులకు అనుకూలమైన వారం. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళతారు. కావలసిన వస్తువులను కొంటారు. అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా వుంటారు. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ, పనులు పూర్తి చేస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయండి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి.
కుంభం
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు అందకపోవడంతో పనులు ఆలస్యం అవుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నదమ్ములు, బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తాయి. విహారయాత్ర ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యవసాయ
దారులకు అనుకూలం. ఇరుగు పొరుగుతో సమస్యలు ఎదురుకావచ్చు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు.
మీనం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ప్రారంభించిన పనులను ఏకాగ్రతతో, పట్టుదలతో పూర్తిచేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. మంచి సంస్థలలో చేరుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. అయితే, పై అధికారుల మద్దతు లభిస్తుంది. వాహనం, భూమి కొనుగోలు ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in