1.మూడోదశ ట్రయల్స్ తర్వాత భారత్ బయోటెక్ టీకా ‘కొవాగ్జిన్’ సామర్థ్యం ఎంత?
2.అమెజాన్ ప్రైమ్‌లో నుంచి ఈ తెలుగు సినిమాను తొలగించాలని ఏ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది?
3.‘సోనూ ఫర్ యూ’ – సోనూసూద్ రూపొందించిన యాప్ లక్ష్యం ఏమిటి?
4.‘గ్లామన్ మిసెస్ ఇండియా-2020’ కిరీటం ఎవరిని వరించింది?
5.ఈమధ్య ఏ సినీ తార ఇంట్లో ఆదాయపన్ను సోదాలు జరిగాయి?
6.గత ఏడాది ప్రతి భారతీయుడూ రోజుకు సగటున ఎంతసేపు టీవీ చూశాడు?
7.హురున్ బిలియనీర్ల జాబితాలో ఎంతమంది హైదరాబాదీలకు చోటు దక్కింది?
8.ఏమిటిది? ఎందుకు వార్తల్లోకి ఎక్కింది?
9.ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన తెలుగు రచయిత పేరేమిటి?
10.సిద్దిపేట జిల్లాలో బయటపడిన ఈ వీరగల్లు ప్రత్యేకత ఏమిటి?
1. 81 శాతం
2. ముంబయి హైకోర్టు
3. రక్తదానం
4. హైదరాబాదీ పల్లవీసింగ్
5. తాప్సీ
6. నాలుగు గంటలు
7. పది మంది
8. రెండువేల ఏండ్ల నాటి రోమన్ చక్రవర్తుల రథం. ఇటలీలో జరిగిన తవ్వకాల్లో బయటపడింది.
9. వెల్చేరు నారాయణరావు
10. ఓ యోధుడి వేటకు సంబంధించిన ఘట్టాన్ని వరుస చిత్రాలతో.. ఆధునిక కార్టూన్ స్ట్రిప్‌ను తలపించేలా చెక్కారు అలనాటి శిల్పులు.