‘తింటనో లేదో అని తిప్పడే అండమని చెప్పినా కానీ, కూర కమ్మగుంది. అసికింత ఊడ్చిపెట్టవే పెండ్లామా’ అనే పదబంధంలో అసికింత అంటే ‘కొంచెం’, ‘చివరిగా మిగిలింది’ అనే అర్థాలున్నాయి. ‘తినగలనో లేదో తక్కువగా వండు’ అని పెండ్లానికి పురమాయించిన మొగుడు, తీరా వంట రుచిగా ఉండటంతో.. అడుగులో మిగిలిన కొంచాన్నికూడా తనకే పెట్టమని అడిగాడని అర్థం. ‘పోనిలే అస్కింత ఇచ్చేయ్’ వంటి సందర్భాలను అనుసరించీ ఈ పదాన్ని అర్థం చేసుకోవచ్చు.