యాంటీబయాటిక్స్… మానవాళి పాలిట వరం. శరీరం మీద దాడి చేసే సూక్ష్మక్రిముల పాలిట శాపం. కానీ మోతాదును మించి కానీ, దీర్ఘకాలం పాటు కానీ తీసుకుంటే ఎన్నో దుష్ఫలితాలకు దారితీస్తాయి. అయితే, ఒక రోగికి ఎంత స్థాయిలో యాంటీబయాటిక్ ఇవ్వాలి, అది ఎంతసేపు పనిచేస్తుంది అన్నది తెలుసుకోగలిగితే… ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు. కానీ, అదేమంత తేలికైన వ్యవహారం కాదు. ఇందుకోసం ఖరీదైన, క్లిష్టమైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ, జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇందుకు ఓ సులువైన పరిష్కారం కనుగొన్నారు. మన శ్వాసను బట్టి యాంటీబయాటిక్స్ శాతాన్ని తెలుసుకునే సాంకేతికతను రూపొందించారు. యాంటీబయాటిక్స్‌కు స్పందించే కొన్ని రకాల ప్రొటీన్లను ఉపయోగించడం వల్ల ఇది సాధ్యమైంది. అంతేకాదు! దీన్ని రోగి తాలూకు మాస్క్‌లో అమర్చడం వల్ల, ఎప్పటికప్పుడు శరీరంలోని ఔషధాల శాతాన్ని గమనిస్తూ… తదను
గుణంగా చికిత్స చేసే అవకాశం ఉంటుంది.