పొత్తి పరుసుడు పసిగుడ్డును పడుకో పెట్టడానికి పొత్తిపరిసి, తల చుట్టూ మంచిగ సుట్టి పడుకోపెడుతారు. దీంతో తల సొట్టపోకుండ ఉంటుంది. అందుకే ‘పొత్తిల్లలో బిడ్డ’ జాగ్రత్తా అంటారు.
అంబటేల అయిందా? : అంబలి తాగే సమయం. నాటి రోజుల్లో అంబలి కాసి, గటుక వండుకొని కైకిలు పోయేటోళ్లు. ‘అంబటేల’ అంటే ‘అంబలి తాగే సమయం’ కాగానే అంబలి తాగి పనిలో నిమగ్నమయ్యేవారు. తర్వాత ఎండగొట్టేళకు (మధ్యాహ్నం) సద్ది తినేవారు.
దూళ్లు: పశువులకు పుట్టిన పిల్లలు. ల్యాగలు. తల్లిని మందలో కలిపి మేతకు పంపిన తర్వాత.. దూళ్లను వదులుతారు. అవి ఇంటిపొంటి మేస్తూ.. రంకెలేస్తూ ఉంటాయి.
మన్నెంపోవుడు జీవాలు (గొర్లు, మేకలు) మేపేవాళ్లు గడ్డికోసం కుటుంబాలను వదిలి సుదూర ప్రాంతాలకు పోవడాన్ని ‘మన్నెంపోవుడు’ అంటారు.
తెప్పవాన = పరిమిత ప్రదేశంలో కురిసే వాన. చిన్న మేఘం/మబ్బు నుంచి పడేవాన.