కలుము = ఊర్లో ఎవరైనాచనిపోతే ఆ మరుసటి రోజునుకలుము అంటారు.ఉచ్చిలోడు = రహస్యాలను కడుపులో దాచుకోకుండాఇతరులకు చెప్పేవాడు/చేరవేసేవాడు.కొన్ని ప్రాంతాల్లో ‘ఉచ్చుబ్బులోడు’ అనీ అంటారు.కమ్మిచ్చుడు = మోసం చేయడం. ‘వాడు మస్తుకమ్మిస్తడు. మొన్న మాటలతో కమ్మిచ్చి డబ్బులుఎత్తుకపోయిండు’ అంటారు.కట్టె సర్సుడు = మొద్దుబారిపోవడం/నిశ్చేష్టుడు కావడం. ‘వాయమ్మా..వాడేందే కట్టె సర్సినైట్టెండు’ఉడిది లేసుడు = భూమిలోంచి వచ్చే సెగలు.బాగా ఎండకొట్టిన తర్వాత కాస్త వానపడితే..‘అగో భూమిలోంచి ఉడిది లేసింది సూడు’ అంటారు.