e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home చింతన శ్రీ గణేశ ప్రార్థన:

శ్రీ గణేశ ప్రార్థన:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే ॥
ఉ. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్‌
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్‌
చం. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్‌
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన జేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా
క. తలచితినే గణనాథుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా!
దలచితినే హేరంబుని! దలచితి నా విఘ్నములను తొలగించుటకున్‌
క. అటుకులు కొబ్బరి పలుకులు! చిటి బెల్లము నానబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్ర సుతునకు! పటుతరముగ విందు చేసి ప్రార్థింతు మదిన్‌!

దీపారాధన

- Advertisement -

శ్లో॥ భో దీపదేవీ రూపస్త్యం కర్మసాక్షి హ్యమిఘ్నకృత్‌
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ॥
దీపారాధన ముహూర్తః సుముహోర్తోస్తు.

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని 3 సార్లు జలం తాగాలి). ఓం గోవిందాయ నమః (ఒకసారి నీటిని పళ్లెంలో వదలాలి), ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనా య నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అనుకుని కొద్దిగా నీళ్లు తలపై చల్లుకోవాలి)
శ్లో॥ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా
యస్మరేత్‌ పుండరీకాక్షం సబాహ్యంభ్యంతర శ్శుచిః
(ఈ మంత్రం చదివి చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని కింది మంత్రాన్ని పఠించాలి)

ప్రాణాయామం

శ్లో॥ ఉతిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ॥
కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు (కుడివైపు)
జల్లుకొని ఈ మంత్రం చదువాలి.
ఓం భూః ఓం భువః ఓగ్‌ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌ ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌
..చేతిలో అక్షతలు తీసుకొని సంకల్పం చెప్పాలి

సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశోభనే ముహూర్తే శ్రీమహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతఖండే, భరత వర్షే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, కృష్ణా గోదావర్యోః మధ్యదేశే, స్వగృహే (సొంతిల్లు కానివారు లక్ష్మీ నివాస గృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్లవ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షరుతౌ, భాద్రపదమాసే, శుక్ల పక్షే హస్తా నక్షత్ర ప్రయుక్త చతుర్థ్యాం తిథౌ, భృగు వాసరే శుభవాసరే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్‌ శ్రీమతః ……. గోత్రః (ఎవరికి వారు గోత్రం చెప్పుకోవాలి)…… నామధేయః(కుటుంబ పెద్దపేరు మాత్రం చెబితే చాలు) ……. గోత్రోద్భవస్య …… (గోత్రం) నామధేయస్య (వినాయక వత్రంలో పాల్గొంటున్నవారితోపాటు కుటుంబసభ్యులందరి పేర్లనూ చెప్పుకోవచ్చు) ధర్మపత్నీ సమేతన్య (వివాహం అయినవారు మాత్రమే చదవాలి) మమ సహకుటుంబస్య, సబాంధవస్య క్షేమ ైస్థెర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, సమస్త దురితో పశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవతా ముద్దిస్య, వర్షేవర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే..
అంటూ అక్షతలు, నీళ్ళు పళ్లెంలో వదలాలి.

కలశారాధన

అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే
ఒక చెంబును తీసుకుని దానికి పసుపు రాసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత ఆ పాత్రలో తమలపాకు, అక్షతలు వేసి ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి ఈ శ్లోకాన్ని చెప్పాలి.
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరాః
రుగ్వేదోద యజుర్వేదః సామవేదో అధర్వణః
అంగైశ్చసహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
కలశంలోని నీటిని తమలపాకుతో తిప్పుతూ ఈ కింది శ్లోకాన్ని పఠించాలి
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు
కలశంలోని నీటిని తమలపాకుతో వినాయకుడి మీద, పూజా ద్రవ్యాల పైన, పూజలో కూర్చున్నవారిపై, కుటుంబ సభ్యులపై చిలకరించాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana