e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home బతుకమ్మ విరుగుడు టీకా

విరుగుడు టీకా

ప్రపంచమంతా కరోనాతో కకావికలమవుతున్నది. ఆప్తులను కోల్పోయి ఎందరో ఆవేదనలో కూరుకుపోయారు. ఉపాధి కరువై ఎందరెందరో నిరాశ్రయు లయ్యారు. నిరాశలో కూరుకుపోయిన జనాలకు ఇప్పుడు కావాల్సింది కాస్తంత ధైర్యం. కరోనాకు విరుగుడు టీకా! ఆ వైరస్‌ మనుషుల మనసుల్లో సృష్టించిన అగాధానికి మందు నాలుగు ధైర్య వచనాలు. మధుకర్‌ వైద్యుల అదే ప్రయత్నం చేశారు. తన ‘వలపోత’ కవితల ద్వారా కరోనా కట్టడిలో అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులకు అక్షర నీరాజనం అందించారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు సలాం చేశారు. వలసజీవుల వెతలను కండ్లకు కట్టారు. ‘రేపటి స్వప్నాన్ని’ మళ్లీ చిగురింపజేయడానికి కావాల్సిన ఉత్సాహాన్నీ ఇచ్చారు.

వలపోత
రచన: మధుకర్‌ వైద్యుల పేజీలు: 36, వెల: రూ.50
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు, 80966 77409

- Advertisement -

ఆదిశక్తి (మొగ్గలు)
అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ ఆదిశక్తి. జగన్మాతను కొలిచిన వారికి ఆమె కొంగు బంగారమవుతుంది. ఈ శక్తి తత్వాన్ని తెలియజేస్తూ అందమైన మొగ్గలు రాశారు రచయిత్రి. అమ్మ అవతార విశేషం, నవరాత్రి సంబురం, సప్తశతి వైభవం, శ్రీచక్ర ప్రాభవం, అష్టాదశ శక్తిపీఠాల మహాత్మ్యం అందంగా వివరిస్తూ అమ్మవారిని స్తుతించారు.

రచయిత్రి: సత్య నీలిమ పేజీలు: 34, వెల: రూ.30
ప్రతులకు: 95021 56813, 94909 11217

గుండె సవ్వడి
గుండె చెప్పే సంగతులు ఎన్నో ఉంటాయి. అమ్మ ప్రేమను చెబుతుంది, తేడాను గుర్తిస్తుంది, నిజాన్ని జ్ఞప్తికి తెస్తుంది, ఆలోచనలను పురిగొల్పుతుంది. తన ప్రయాణంలో గుండెను తాకిన దృశ్యాలను, మనసును హత్తుకున్న సంగతులను ‘గుండె సవ్వడి’ కవితల రూపంలో ఆవిష్కరించారు రచయిత.

రచయిత: బి.శశికుమార్‌
పేజీలు: 72, వెల: రూ.90
ప్రతులకు: 99632 65159
పాలపిట్ట బుక్స్‌: 040- 27678430

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana