e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home బతుకమ్మ వాస్తు

వాస్తు

వాస్తు

మా ఇంటికి ఈశాన్యంలో కారు పార్కింగ్‌ ఉంది. దానిని గ్లాస్‌తో గదిగా మార్చుకోవచ్చా? సుందరం, కెపీహెచ్‌బీ

ఇంటి ఈశాన్యాన్ని తెంపిన ఇల్లు మీది. దానిని గదిగా మార్చుకోవాలనుకోవడం మంచి ఆలోచన. అయితే, ఇంటికి అది తల వంటిది. దానిని గ్లాస్‌తో కాకుండా పూర్ణంగా ఇటుకలతో కట్టండి. తంతులాగ కట్టొద్దు. ఈశాన్య గది అంటేనే సింహద్వారం ఉంటుంది. గడపతో అది ఎంతో ముఖ్యం. గ్లాస్‌లతో గది చేయడం పూర్ణత్వం కాదు. కొన్ని లే అవుట్లలో అలా కొందరు సర్దుబాటు చేసుకుంటుంటారు. కానీ, ప్రధానద్వారంతో ఉన్న గది ఇంటిని పోలి ఉండాలి. ఇంటి ఒంటితో అది మిళితం కావాలి. అప్పుడే అద్భుత ఫలితాలను ఇస్తుంది.

ఇల్లు పూర్తి కాకముందే గృహ ప్రవేశం చేయవచ్చా? హిరణ్మాయి, చంపాపేట్‌
ఇంట్లోకి ప్రవేశం ఒక జీవితకాల శుభారంభం. దానిని శాస్ర్తోక్తంగా, చక్కగా జరుపుకోవాలి. ఇంటి కల్యాణం, వాస్తుపూజ, హోమం, సత్యనారాయణస్వామి వ్రతం మొదలైన పూజాది కార్యాలతో అన్నపానాది దానాలు, అతిథి సత్కారాలతో జరపాలి. తొందర పనికిరాదు. ముఖ్యంగా ఇంటి నిర్మాణాన్ని పూజ లోపే పూర్తి చేసుకొని ముహూర్తం నిర్ణయించుకోవడం మంచిది. కనీసం మూడు రాత్రులు కొత్తింట్లో శయనం, దీపారాధన అవసరం. ఇంట్లో అన్ని పనులు పూర్తయినప్పుడే కదా, ఇదంతా సాధ్యం. కాబట్టి, ఇల్లు అయ్యాకే ప్రవేశం జరుపుకోవడం మంచిది. కనీసం పూజగది, పడక గదులు పూర్తి కాకుండా గృహ ప్రవేశం జరుపకూడదు.

ప్ర. మాది గేటెడ్‌ కమ్యూనిటీ. కానీ, ‘డ్రెయినేజీ సంపు’ ఆగ్నేయంలో ఉంది. మంచిదేనా? నీలి అనుపమ, తెల్లాపూర్‌
కాలనీ ఎక్కడ నూతనంగా నిర్మించినా అన్నిటినీ ప్లాన్‌ చేసినట్టే, సెప్టిక్‌ ట్యాంక్‌నుకూడా జాగ్రత్తగా ప్లాన్‌ చేయాలి. కాలనీ అనేది ఒక ఊరు లాంటిది. కాకపోతే, దానిచుట్టూ కాంపౌండ్‌ కడతారు. వాస్తవానికి కాలనీ మొత్తానికి తూర్పుభాగంలో కానీ, ఉత్తరభాగంలో కానీ సెప్టిక్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేయాలి. దానిచుట్టూ చెట్లు పెంచి ‘వాడని పార్క్‌’లాగా చేయాలి. అవసరమైతే అక్కడ వ్యర్థజలాలను శుద్ధి చేసే ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి. ఆ నీటిని గార్డెనింగ్‌కు వాడుకోవచ్చు. ఆగ్నేయంలో, వాయవ్యంలో కాలనీకి సంబంధించిన సెప్టిక్‌ ట్యాంక్‌లు పెట్టడం మంచిది కాదు. అలా పెట్టాల్సి వస్తే ఆ భాగాన్ని సెపరేట్‌గా ప్రహరీలు కట్టి వేరు చేయాలి. కాలనీలో భాగం కాకుండా ఇండ్లకు దూరంగా ఉత్తరంలోకూడా కట్టవచ్చు.

పోయే ద్వారం, వచ్చే ద్వారం రెండూ ఉండాలని అంటారు. ఏ ద్వారమైనా వచ్చి పోవడానికే కదా? వి. లలిత, కందికల్‌ గేట్‌
శాస్త్రభాష వేరుగా ఉంటుంది. మీరు చెప్పింది ఆగమన-నిష్క్రమణ ద్వారాల గురించి. గృహానికి తూర్పు, పడమరగా వరుసద్వారాలు ఉండాలి. లేదా ఉత్తర, దక్షిణంగా వరుసద్వారాలు ఉండాలి. అది శుభగృహం అవుతుంది. నేలమీద ఇల్లు కట్టినప్పుడు ఎటు వీధి ఉంటే దానిని ఆ వీధి పేరుతో సింహద్వారాన్ని చేర్చుతారు. అంటే, పడమర రోడ్డు ఉండి ఇల్లు కడితే ‘పశ్చిమ సింహద్వార గృహం’ అంటారు. అలా సింహద్వారం ఏ దిశతో ఉన్నా దానికి అభిముఖంగా ఉన్నది నిష్క్రమణ ద్వారం అవుతుంది. అది తూర్పు కావచ్చు, పడమర కావచ్చు. సంచిలాగా కాకుండా వరుస నడకలతో సాగి, వచ్చే- పోయే ద్వారాలతో ఇల్లు శుభంగా ఉండాలి.

సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

Advertisement
వాస్తు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement