e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home బతుకమ్మ వాస్తు, ఇంట్లో ఏ దోషాలు సవరించాలి?

వాస్తు, ఇంట్లో ఏ దోషాలు సవరించాలి?

మా ఇద్దరు అక్కల పెండ్లిళ్లు కుదరడం లేదు. మాది దక్షిణం రోడ్డు ఇల్లు. ఇంట్లో ఏ దోషాలు సవరించాలి?

  • సందుపట్ల నాగేశ్‌, చేర్యాల
    మీరు తూర్పు ముఖ ద్వారంతో ఇల్లు కట్టుకున్నారు. అయితే ఈశాన్యంలో కారు పార్కింగ్‌ కోసం ఆ మూలను కట్‌ చేశారు. అలానే ఈశాన్య ద్వారం బయట అరుగు వేసుకున్నారు. దానిమీద కప్పు ఉందనుకున్నా, మీ ఇంటికి ఈశాన్యం పోయింది. అది మీ శుభకార్యాలను అడ్డుకుంటుంది. దాన్ని వెంటనే సవరించాలి. ఆ భాగం గృహంలో చేరాలి. అలానే, ఏదో మూలకు ఉండాలనే ఉద్దేశంతో ఆగ్నేయం మూలన గేటు పక్కన సెప్టిక్‌ ట్యాంక్‌, నీళ్ల గుంత పెట్టారు. నీటి సంపును ఈశాన్యానికి, సెప్టిక్‌ ట్యాంకును తూర్పు మధ్యకు జరపండి. మీకు దక్షిణం రోడ్డు ఉన్నా, అసలు దక్షిణ ద్వారమే లేకుండా తూర్పు ముఖ
    ద్వారంతో ఇల్లు కట్టుకున్నారు. మీ ఇంటికి దక్షిణం వైపు ఒక ద్వారం పెట్టండి. మెట్ల కింద వాయవ్యంలోని టాయిలెట్‌ తీసేయండి. తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి.

పాత ఇంటి నడుమ మంచినీళ్ల బావి ఉంది. దాన్ని మేం వాడు కోవచ్చా? లేదంటే, వెంటనే పూడ్చేయాలా?

  • వేదుల వాసు, కోరుట్ల
    పల్లెటూళ్లలో ఒకప్పుడు ఇళ్లలో చేదబావులు ఉండేవి. అయితే, చాలా విరుద్ధమైన, శాశ్వత గృహ సమస్యలకు అవి మూలకారణాలుగా ఉంటాయి. ఇంటి మధ్య, ఇంటికి పశ్చిమ, దక్షిణ పెరళ్లలో ఉన్న బావులు ఆ ఇంటోని వారిని మట్టుపెడుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. దక్షిణం దిక్కులోని బావి ఆ ఇంటి ఇల్లాలిపై పెను ప్రభావం చూపుతుంది. ‘నడిమధ్యన బావి నరకాల దీవి’ అన్నట్లు, ఇంటి మధ్యలో బావి ఉన్నవాళ్లు మంచినీళ్ల కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలి. బావిని వెంటనే పూడ్చేయాలి. సూర్యరశ్మి తగిలే ఉత్తర, తూర్పు ఖాళీ స్థలాల్లోనే బావిని నిర్మించాలి. అప్పుడే అది శుభాలను ఇస్తుంది.
- Advertisement -

ముక్కోణపు రోడ్లు ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా?

  • బద్దుల రామారావు, కరీంనగర్‌
    మీ స్థలానికి దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో రోడ్లు ఉన్నాయి. మీ స్థలంలో ఉత్తరం వీధి వాయవ్యం పెంచుకుంటూ పోయింది. అయితే మీరు పశ్చిమ వీధిని ప్రధానంగా చేసుకొని ఇల్లు కట్టుకోవాలి. పశ్చిమంలో అరవై అడుగుల కొలతలో నలభైకి పరిమితమై, దక్షిణంలో నలభై అయిదు అడుగులు తీసుకొని దీర్ఘచతురస్ర ఆకారంలో సమాన కొలతలతో ముందుగా స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలి. ఆ స్థలంలో నిర్మాణానికి ఇంటి నక్షను వాస్తుకు అనుగుణంగా ప్లాన్‌ గీయించాలి. ఇక ఈ ముక్కోణపు స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ముందు తూర్పు, ఉత్తరం ప్రహరీలు కట్టండి. ఈ ప్లాన్‌కు (నక్ష) స్థలం వాడుకోగా, మిగిలిన దాన్ని ‘వాణిజ్యపరంగా’ ఉపయోగించుకోవచ్చు.

ఆఫీసు విదిక్కులో ఉంటే సెప్టిక్‌ ట్యాంకు ఎక్కడ కట్టుకోవాలి?

  • నందుల శంకర్‌, షాద్‌నగర్‌
    ఆఫీసు విదిక్కులకు (మూలల్లో) ఉన్నప్పుడు, దాని రోడ్డు ఈశాన్యంలో ఉంటే అది ‘మంచి ఫలితాలు’ ఇస్తుంది. మిగతా దిక్కుల్లో రోడ్డు ఉంటే ఆశించిన ఫలితాలు రావు. విదిక్కుల స్థలంలో సెప్టిక్‌ ట్యాంకును మూలలకు పెట్టాల్సి ఉంటుంది. అంటే, అక్కడ ప్రధాన దిశలు మూలల్లో చేరతాయి. కాబట్టి ఆఫీసు ఉత్తరం మూలలోగానీ, లేదా తూర్పు మూలలోగానీ ఆఫీసుకు తాకకుండా కాంపౌండులో సెప్టిక్‌ ట్యాంకు కట్టుకోండి. ఇంటి కోణంలో, కాంపౌండు కోణంలో గొయ్యి వస్తుందనే చర్చలకు వెళ్లొద్దు. ఇలాంటి స్థలాల్లో ఆ మూలలే సెప్టిక్‌ ట్యాంకుకు యోగ్యమైనవి.

తూర్పు రోడ్డు ఉన్న పదెకరాల వ్యవసాయ స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టాలి?

  • కోశ్గి రమాదేవి, ముత్తిరెడ్డిగూడెం
    వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు, వీధిని బట్టి అనుకూలమైన స్థలాన్ని ఎంచుకోవాలి. క్షేత్ర విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా ఎక్కడో నైరుతిలో ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఇంటి నిర్మాణానికి వ్యవసాయ క్షేత్రంలో సగభాగం తర్వాత, ఎక్కడైనా సరే తగినంత విస్తీర్ణంలో స్థలాన్ని ఎంచుకోవాలి. ఇంటికి తూర్పు దిక్కులో రోడ్డు ఏర్పాటు చేసుకోవాలి. దానిని ఉత్తరం, ఈశాన్యం వైపునుంచి మొత్తం స్థలానికి తూర్పు ఈశాన్యంలో ప్రధాన రహదారితో కలిసేలా వీధిని వేసుకోవాలి. ఇంటిని కట్టడానికి ముందే, స్థలం రోడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఇల్లు నక్షను వాస్తుపరంగా సిద్ధం చేసుకొని, దానిని ఎంచుకొన్న స్థలంలో ‘దిశాత్మకంగా’ మార్కింగ్‌ చేసుకోవాలి. ముందు ప్రహరీ (కాంపౌండు) కట్టుకొని, తూర్పు ఈశాన్యం గేటుతో అందులో ఇల్లు కట్టుకోవాలి. వ్యవసాయ క్షేత్రంలో ప్రహరీలు లేని ఇల్లు నష్టాలు తెస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement