e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home బతుకమ్మ వాలుచూపుల వారియర్‌!

వాలుచూపుల వారియర్‌!

మూడేండ్ల క్రితం ముప్పై సెకెన్ల వీడియోతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా నిలిచింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఆ వీడియోలో ప్రియ హావభావాలకు అమ్మాయిలు కూడా ఫిదా అయిపోయారు. ‘ఒరు ఆదార్‌ లవ్‌’ అంటూ యువత మనసుల్ని దోచేసింది. ఇప్పుడేమో ‘ఇష్క్‌’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ భామ ప్రియా వారియర్‌ ముచ్చట్లు..

ప్రియా ప్రకాశ్‌ తన మొదటి సినిమాలోని ఓ పాటలో హీరోను ఉడికించేందుకు యథాలాపంగా ఓసారి కన్ను గీటింది. ఆ వలపు బాణాలకు హీరో మాత్రమే కాదు, ప్రపంచంలోని సినిమా ప్రేక్షకులంతా
పడిపోయారు. ఒక్కరోజులో వీడియో వైరల్‌ అయిపోయింది.

- Advertisement -

‘నేను గత ఏడాది బీకామ్‌ పాసయ్యాను. ఇక నుంచి సినిమాల మీదే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాను.ఇంత పేరు, ఇంత సంపాదన మరే వృత్తిలోనూ ఉండవు. ఓ సినిమా విజయంలో మనం భాగం కావడం అన్నది మామూలు విషయం కాదు’

‘ఎప్పుడు ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. నా మొదటి సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో చదువు కారణంగా మంచి ఆఫర్లను కూడా వదులుకోవాల్సి వచ్చింది. కానీ గతాన్ని తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే, ముందుకెళ్లలేం కదా!’

‘మలయాళంతో పోల్చితే తెలుగు ప్రేక్షకుల అభిరుచి భిన్నంగా ఉంటుంది. అక్కడ మంచి కంటెంట్‌ ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఫీల్‌గుడ్‌ సాంగ్స్‌తోపాటు ఫైట్స్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఎక్కువగా ఇష్టపడతారు’

‘తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొని ఇక్కడి ప్రేక్షకులను మరింత అలరించాలని అనుకుంటున్నా. హిందీలోనూ రెండు సినిమాలు చేస్తున్నా. మలయాళంలో చాన్స్‌ వస్తే తప్పకుండా చేస్తా. తెలుగు కొంచెంకొంచెం నేర్చుకుంటున్నా. ఎవరైనా మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఇంకో రెండు సినిమాలు చేస్తే గడగడా మాట్లాడగలనేమో!’

‘ప్రతిసారీ కంటెంట్‌ మీదే దృష్టిపెట్టకుండా కమర్షియల్‌ సినిమాలూ చేయాలని ఉంది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకూ ఓకే చెప్పాలని మనసులో ఉంటుంది. ‘చెక్‌’లో చాలా వైవిధ్యమైన పాత్ర కాబట్టే ఒప్పుకొన్నా. ‘ఇష్క్‌’లో పూర్తిస్థాయి హీరోయిన్‌గా నటించా. ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే.. చాలా ఆనందంగా అనిపిస్తుంది’

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana