e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home బతుకమ్మ రైతన్నకు దిక్సూచి

రైతన్నకు దిక్సూచి

ఆరుగాలం శ్రమించినా, రైతన్న తన కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేకపోతున్నాడు. కాయకష్టం చేసే శక్తి ఉన్నా, భూదేవికి మించిన ఓపిక ఉన్నా.. వేసిన పంటలే వేస్తూ చేతులు కాల్చుకుంటున్నాడు. కర్షక లోకానికి కొత్తదారి చూపే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని తెచ్చారు గ్రంథకర్త ఎస్‌.కె.ఎమ్‌.పాషా. రైతుల ఇంట కాసుల వర్షం కురిపించే లక్ష్యంతో ‘అగర్‌వుడ్‌’ సాగు విధానాలను సవివరంగా ఇందులో పొందుపరిచారు. ఏ సమయంలో విత్తనాలు నాటాలి, మొక్కలను ఎలా సంరక్షించాలి, చెట్లను ఎలా కాపాడుకోవాలి, కలపను వాణిజ్యం చేసుకునే పద్ధతులేమిటి అన్నది ఈ పుస్తకంలో ప్రస్తావించారు. అగర్‌వుడ్‌ (ఊద్‌) చెట్లకు ఉన్న డిమాండ్‌ను తెలియజేశారు. తెలుగులో మొట్టమొదటిసారిగా అగర్‌వుడ్‌ సాగు, సేంద్రియ పద్ధతులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి సవిస్తారంగా పేర్కొన్నారు.

అగర్‌వుడ్‌ చెట్ల పెంపకం
(మహాగని చెట్లసాగుతో సహా)
రచన: ఎస్‌.కె.ఎమ్‌.పాషా
పేజీలు: 192, వెల: రూ.250
ప్రతులకు: ద పయనీర్‌ అసోసియేషన్‌
11-218, మసీదు వీధి, సారపాక
బుర్గంపహాడ్‌, భద్రాచలం- 507128
ఫోన్‌: 63019 54084

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana