e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home బతుకమ్మ రాశి ఫలాలు

రాశి ఫలాలు

రాశి ఫలాలు

మేషం
తలపెట్టిన పనులను బాధ్యతాయుతంగా పూర్తిచేసి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో కొంత బరువు, బాధ్యతలు పెరిగినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో రాణిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. ఒకపక్క ఖర్చులుకూడా పెరుగవచ్చు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. పిల్లలతో సంతోషంగా ఉంటారు. పెద్దలపట్ల గురుత్వభావం పెంపొందుతుంది. ఆలోచించి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులు, ఆత్మీయులతో ఖర్చులు పెరుగవచ్చు. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండటంతో పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు.

వృషభం

- Advertisement -

ద్దల సలహా, సూచనల మేరకు పనులు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఇంటి వాతావరణం క్రమేపీ అనుకూలంగా మారుతుంది. సామరస్యంతో పనులు నెరవేర్చుకుంటారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనిపై మనసు నిలుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. గతంలోకంటే ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. నిత్య వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు సమయానుకూలంగా చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. బరువు, బాధ్యతలతో కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. ఆఫీసు పనులు సంతృప్తికరంగా సాగుతాయి. పై అధికారులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం
ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. స్నేహితులు, బంధువర్గంతో కార్యసాఫల్యం ఉంటుంది. మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. పరిచయాలు విస్తరించడంతో చాలా పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలను ఆచరణలో పెట్టి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక ఇబ్బందులతో కొంత ఆలస్యం జరుగవచ్చు. వృత్తి, వ్యాపారాలలో బరువు, బాధ్యతలు పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో సంతృప్తిగా పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం లభిస్తుంది. తోటివారితో స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు.

కర్కాటకం
ప్రయాణాలు కలిసివస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. మనసు నిలిపి, శ్రద్ధగా చేయడం వల్ల పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు, తోటివారితో వివాదాలు ఉండవచ్చు. సంయమనం పాటించాలి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఆత్మీయులు, స్నేహితులు రావడంతో ఖర్చులు పెరుగుతాయి. వివాదాల్లోకి వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం అవసరం. కోర్టు పనులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలలో ఖర్చులు పెరుగుతాయి.

సింహం
ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. సంగీత, సాహిత్య, కళారంగాలవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. చేతిలో డబ్బు ఉండటంతో కొత్త పనులు ప్రారంభించే ఆలోచనలు చేస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో ఖర్చులు ఉండవచ్చు. కార్యసాఫల్యం ఉంటుంది. నిత్య వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వాములతో స్నేహం పెంపొందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో మనస్పర్ధలు ఉండవచ్చు. పై అధికారుల ఆదరణ బాగా లభిస్తుంది. మంచిపేరు సంపాదిస్తారు. సంతృప్తిగా ఉంటారు.

కన్య
నిత్య వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కోర్టు పనులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక అనుకూలత ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో అనుకున్న విధంగా ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో ఖర్చులు పెరుగుతాయి. పనులు మాత్రం పూర్తయ్యే అవకాశాలు వున్నాయి. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపడం అవసరం. పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. సాహితీ వేత్తలకు అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు రావడంతో ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై మనసు నిలుపుతారు.

తుల
ఇంటి వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్నేహితులు, బంధుమిత్రుల రాకతో సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు చదువులో రాణించి, సత్ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యా యత్నాలలో ఆర్థిక ఆటంకాలు ఎదురైనా ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తోటివారితో, పై అధికారులతో సామరస్యత పెంపొందుతుంది. ఆదాయం లభిస్తుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. సాహిత్యవేత్తలకు, కళాకారులకు ఈవారం అనుకూలంగా ఉంటుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గత పెట్టుబడులవల్ల ఆదాయం పెరుగుతుంది. ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. పనులు పూర్తి కావడంలో జాప్యం ఉండవచ్చు. ఆస్తుల విషయంలో వివాదాలు కొనసాగుతాయి. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. మంచివారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతృప్తిగా ఉంటూ, కొత్త పనులు చేయడంపై చర్చిస్తారు. అందరి సహకారం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహాయ సహకారాలు అందుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది.

ధనుస్సు
తలపెట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు అనుకున్న సమయంలో చేతికి అందకపోవడంతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ముఖ్యంగా ఖర్చుల నియంత్రణ అవసరం. పనులపై మనసు నిలపాలి. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. వాహనాలవల్ల ఖర్చులు ఉంటాయి. భూతగాదాలు, ఆస్తుల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో తోటి ఉద్యోగులతో, పై అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

మకరం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ఉత్సాహంతో పనులలో పాల్గొంటారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యమైనా వృత్తి, వ్యాపారం, స్థిర, చరాస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. ఒకపక్క అనుకోని ఖర్చులుకూడా ముందుకు రావచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దలపట్ల గౌరవంతో ఉంటారు. పనులు నెరవేర్చుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారస్తులకు సిబ్బందితో స్నేహం పెరుగుతుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం
పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మంచి పనులవల్ల ఖర్చులు పెరుగవచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పై చదువుల ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఉత్సాహంగా ఉంటూ, పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. స్నేహితులు, ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలు పెంపొందుతాయి. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు అనుకూలం. నిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులకు అనుకోని ఖర్చులు ఎదురైనా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.

మీనం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారంలో బరువు, బాధ్యతలు పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. నిత్య వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. సమాజంలో అందరితోనూ స్నేహంగా ఉంటూ మంచిపేరు సంపాదిస్తారు. పనులు నెరవేర్చుకుంటారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. వ్యవసాయదారులకు సానుకూల వారం. అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : [email protected]

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాశి ఫలాలు
రాశి ఫలాలు
రాశి ఫలాలు

ట్రెండింగ్‌

Advertisement