e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home బతుకమ్మ రాశి ఫలాలు

రాశి ఫలాలు

రాశి ఫలాలు

18.4.2021 నుంచి 24.4.2021 వరకు

మేషం
గురు సంచారం అనుకూలిస్తుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వృత్తి లాభసాటిగా ఉంటుంది. నిత్యవ్యాపారం కలిసి
వస్తుంది. కొత్త పనులు అనుకూలిస్తాయి. డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అన్నదమ్ములు, స్నేహితులతో పనులు పూర్తవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూములు, గృహనిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులను కొంటారు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. స్నేహభావం పెరుగుతుంది.

వృషభం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు తోటివారితో, అధికారులతో స్నేహభావం పెరుగుతుంది. సహకారం లభిస్తుంది. ప్రయాణాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. పిల్లల చదువు విషయం అనుకూలిస్తుంది. మంచి సంస్థలలో ఉద్యోగం లభించవచ్చు. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఓపికతో పనులు చేయడం ముఖ్యం. సత్ఫలితాలను పొందుతారు. వృథా ఆలోచనలను పక్కనపెట్టి కార్యనిర్వహణపై మనసు నిలపాలి. ఆస్తుల తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా వృత్తిలో సంతృప్తి ఉంటుంది.

మిథునం
గత ఇబ్బందులు దూరమవుతాయి. పనులలో సానుకూలత పెరుగుతుంది. పిల్లల వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉండటంతో కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదురైనా పనులు పూర్తవడంతో సంతృప్తి లభిస్తుంది. కుటుంబంలో అందరి సహకారం ఉంటుంది. భార్యాపిల్లలతో ఆనందంగా ఉంటారు. రావలసిన సొమ్ము సరైన సమయంలో చేతికి అందక పనులు వాయిదా పడతాయి. సమాజంలో కొత్త పరిచయాలవల్ల కొన్ని పనులు నెరవేరవచ్చు. ఖర్చులు నియంత్రించడం అవసరం.

కర్కాటకం
స్నేహితులు, బంధువర్గంతో సంబంధ బాంధవ్యాలు పెంపొందుతాయి. కార్యసాఫల్యత ఉంటుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులలో కొంత ఆలస్యం ఉండవచ్చు. సహనంతో పనులు చేయడం అవసరం. రియల్‌ ఎస్టేట్‌, గృహ నిర్మాణ పనులు కలిసివస్తాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో అనుకూలత ఉంటుంది. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. సమయానికి డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మంచివారితో స్నేహం పెరుగుతుంది. నిత్యవ్యాపారం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణలో జాగ్రత్త అవసరం.

సింహం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందడంతో కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వ్యాపార లావాదేవీలు, ఒప్పందాలు చేసుకుంటారు. కార్యనిర్వహణపై శ్రద్ధ నిలుపుతారు. ఆలోచనలను ఆచరణలో పెడతారు. సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలించి శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వివాదాలకు దూరంగా ఉంటూ, పనులపై మనసు నిలుపడం అవసరం.

కన్య
పనులలో కొంత ఆలస్యమైనా సంతృప్తికరంగా పూర్తవుతాయి. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమంగా పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం తీసుకుంటారు. నిత్య వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. విందులు, వినోదాలవల్ల ఖర్చులు పెరుగవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తద్వార కార్యసాఫల్యత ఉంటుంది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు ఆఫీసులో పై అధికారులతో, తోటివారితో సంతృప్తిగా ఉంటారు. అధికారులతో స్నేహం పెరుగుతుంది. మనసు నిలిపి శ్రద్ధతో పనులు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల
గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులు చదువులో రాణించి మంచిస్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో అందరితోనూ స్నేహంగా ఉంటూ పనులు చేస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడంతో కొన్ని పనులలో జాప్యం ఉంటుంది. వాహనాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులు, బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకున్న పనులు పూర్తవుతాయి. పనివారితో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు.

వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉన్నా పనులు పూర్తవడంలో నలుగురి సహకారం అవసరం పడవచ్చు. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తి ఉంటుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. అప్రమత్తతతో ఉండాలి. మంచి అవకాశాలు వస్తాయి. ప్రారంభించిన పనులు పూర్తవడంలో ఆలస్యం వల్ల కొంత అసంతృప్తి, చికాకు ఉండవచ్చు. పిల్లల పనులు, చదువు, వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారి చదువు కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులలో అనుకూలత ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సిబ్బందితో స్నేహ వాతావరణం ఉంటుంది.

ధనుస్సు
బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పండుగ వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరుగవచ్చు. సమాజంలో పరిచయాలు పెరిగి, కార్యసాఫల్యత ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆర్థిక సమస్యలవల్ల జాప్యం ఉంటుంది. నిత్యవ్యాపారం కలిసివస్తుంది. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. బయటి వాతావరణం సహాయకరంగా ఉంటుంది. ప్రయత్నాలు ఫలించి తాత్కాలిక ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తోటివారితో, పై అధికారులతో స్నేహంగా ఉండాలి. పనులపై మనసు నిలుపడం అవసరం. పెద్ద మొత్తంలో పెట్టుబడులను పెట్టడానికి కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిది.

మకరం
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. వాతావరణం అనుకూలిస్తుంది. పిల్లల చదువు, వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగస్తులు అధికారులతో, తోటివారితో స్నేహంగా ఉంటూ పనులు పూర్తి చేసుకుంటారు. నిత్యవ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. భార్యాపిల్లలతో హాయిగా గడుపుతారు. బంధువుల రాకతో కొంత ఖర్చులు పెరుగవచ్చు. అయినా, సంతోషంగా ఉంటారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో కొంత ఇబ్బంది ఉన్నా పనులు పూర్తవుతాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.

కుంభం
నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వృత్తిలో పనిభారం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. భార్యాపిల్లలతో ఆనందంగా ఉంటారు. పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. శుభకార్యాలవల్ల ఖర్చులు పెరుగవచ్చు. ముఖ్యంగా ఖర్చులపై నియంత్రణ అవసరం. అందరి సహకారంతో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రచయితలు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు సిబ్బందితో అభిప్రాయ భేదాలున్నా పనులు పూర్తవుతాయి. సమాజంలో మంచిపేరు పొందుతారు. కొత్త పరిచయాలతో కొన్ని పనులు సాధించుకుంటారు.

మీనం
ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. తద్వారా కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యత ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. శుభకార్యాలవల్ల ఖర్చులు ఉంటాయి. వ్యవసాయదారులు పనివారి అనుకూలతతో సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వస్తువులు, స్థిర చరాస్తుల కొనుగోలుకు అనుకూలమైన వారం. కళాకారులకు, రచయితలకు, సాహిత్యవేత్తలకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది.

Advertisement
రాశి ఫలాలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement