e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home బతుకమ్మ మ్యాట్రిమోనీ పేరయ్య

మ్యాట్రిమోనీ పేరయ్య

ఆడపిల్లను మెట్టినింటికి పంపాలంటే కన్నవారు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అప్పట్లో అయితే, అబ్బాయి గుణగణాల నుంచి ప్రవర్తన, వృత్తి, కుటుంబ నేపథ్యం.. మొత్తంగా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించీ ఆరా తీసిన తర్వాతే సంబంధం ఖాయం చేసుకొనేవారు. అదే, ఇప్పుడు? మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించాల్సిందే. అక్కడా, విశ్వసనీయత తక్కువే. కుప్పలకొద్దీ నకిలీ ప్రొఫైళ్లు! తేడా వస్తే, ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ‘మేమున్నాం..’ అంటారు ‘హ్యాపిలీ ఎవర్‌’ అక్కిరాజు వంశీకృష్ణ.

హైదరాబాద్‌కు చెందిన ఓ వధువు పేరు రజని (పేరు మార్చాం). మంచి కుటుంబం. తల్లిదండ్రులు రజనికి ఓ మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా సంబంధం కుదిర్చారు. అబ్బాయి ఫొటోలో బాగానే ఉన్నాడు. నేవీలో ఉద్యోగమన్నాడు. రజని కూడా మనసుపడింది. చాటింగ్‌, కాల్స్‌ చేసుకున్నారు. తీయగా మాట్లాడేవాడు వరుడు. కొద్దిరోజుల తర్వాత రజనికి ఓ ఖరీదైన గిఫ్ట్‌ పంపానని చెప్పాడు. అదికాస్తా కస్టమ్స్‌ అధికారుల వద్ద ఆగిందని వర్తమానం అందించాడు. ‘కానీ, దాన్ని విడిపించాలంటే కొంత డబ్బు చెల్లించాలి’ అన్నాడు. కాబోయే భర్త పంపిందేగా అన్న నమ్మకంతో, అతను ఫార్వార్డ్‌ చేసిన లింక్‌ను ఓపెన్‌ చేసింది. ఓటీపీ కొట్టగానే, రజని ఖాతాలోంచి లక్షల రూపాయలు మాయమయ్యాయి. దీంతో పోలీసులను ఆశ్రయించింది. సైబర్‌ నేరగాళ్లు సదరు మ్యాట్రిమోనీలో ఫొటోలు పెట్టి, మాయమాటలు చెప్పి, డబ్బు గుంజారని తేలింది. ఇలా మ్యాట్రిమోనీల ద్వారా, డేటింగ్‌ యాప్స్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు ఎంతోమంది అమ్మాయిలు. ఇటువంటి నేరాలకు చెక్‌ పెడతామని భరోసా ఇస్తున్నాడు అక్కిరాజు వంశీకృష్ణ. తన ఫ్రెండ్‌ చంద్రశేఖర్‌తో కలిసి ‘హ్యాపిలీ ఎవర్‌’ అనే స్టార్టప్‌కు రూపమిచ్చాడు ఈ యువకుడు. ఈ వ్యాపార ఆలోచన వెనుక స్వానుభవం ఉంది.

- Advertisement -

కచ్చితత్వానికి..
‘హ్యాపిలీ ఎవర్‌’ సైట్‌లో ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉండేలా జాగ్రత్తపడ్డాడు వంశీ. ముఖ్యంగా సెల్ఫీ చెక్‌ తప్పనిసరి. కృత్రిమమేధ సాయంతో.. సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటోను, వరుడికో వధువుకో పంపిన సెల్ఫీనీ పోల్చి చూస్తారు. సెల్ఫీ మార్చాలంటే అనుమతి తప్పనిసరి. దీంతో మొదట్లోనే సగం సమస్య తీరుతుంది. ఆ తర్వాత సైట్‌లో నమోదైన యువతీ యువకుల రుణ చరిత్రను ఆరా తీస్తారు. కొందరు లక్షల్లో జీతం వస్తుందంటూ మోసం చేస్తుంటారు. అటువంటి వారిపై కూడా ఓ కన్నేస్తారు. వయసు నిర్ధారించుకోవడానికి ఆధార్‌, పాన్‌కార్డు వంటివి వెరిఫై చేస్తారు. వధూవరులు మానసికంగా ఎంత స్ట్రాంగో తెలుసుకునేందుకు కొన్ని టెస్టులు పెడతారు. అలాగే వారు జీవితాంతం సుఖంగా కలిసి ఉండేందుకు, ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకునేలా కొన్ని వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరికి న్యాయవాదుల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించి.. పెండ్లిని ఓ బాధ్యతగా, పండుగలా నిర్వహిస్తారు. ప్రస్తుతం, వంశీకృష్ణ వివాహ వ్యాపారమే కాదు, వైవాహిక జీవితమూ మూడు పువ్వులూ ఆరు కాయలే!

ఆ కష్టాలు మరొకరు పడొద్దనే
‘నేను ఐఐటీ రామయ్యగారి స్టూడెంట్‌ను. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నా. నా మొదటి పెండ్లి విడాకులైన తర్వాత రెండో వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. మ్యాట్రిమోనీల నిండా మోసగాళ్లే! నకిలీ అకౌంట్లు, నకిలీ నంబర్లే ఎక్కువ. డేటింగ్‌ యాప్‌లలోనూ మోసాలే. నాలా మరొకరు ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ‘హ్యాపిలీ ఎవర్‌’కు రూపమిచ్చా. మా మ్యాట్రిమోనీ ద్వారా ఒక్కటి కావాలనుకున్న జంటలు 11 సూత్రాలు కచ్చితంగా పాటించాల్సిందే. ప్రస్తుతం యూఎస్‌, హైదరాబాద్‌లలో మా సేవలు అందిస్తున్నాం. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో మంచి సంబంధాన్ని వెతుక్కోవచ్చు’ అంటూ తన గతాన్ని వివరిస్తాడు వంశీకృష్ణ.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement