e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home బతుకమ్మ మా స్థలానికి దక్షిణ నైరుతి ‘చతురస్రం’గా పెరిగింది. అందులో ఆఫీస్‌ భవనం కట్టుకోవచ్చా?

మా స్థలానికి దక్షిణ నైరుతి ‘చతురస్రం’గా పెరిగింది. అందులో ఆఫీస్‌ భవనం కట్టుకోవచ్చా?

మా స్థలానికి దక్షిణ నైరుతి ‘చతురస్రం’గా పెరిగింది. అందులో ఆఫీస్‌ భవనం కట్టుకోవచ్చా?
  • కోడి చంద్రకళ, వైరా

ఇంటి స్థలానికి నైరుతి భాగంలో పెరిగిన స్థలం చిన్నదిగా ఉండి, ‘చతురస్ర ఆకారం’తో ఉన్నప్పుడు దానిని విడిచి, మిగతా స్థలానికి కాంపౌండ్‌ కట్టుకోవాలి. అప్పుడే మీ ఇంటిస్థలానికి బలం ఉంటుంది. నైరుతి మూలలో వేరు చేసిన స్థలాన్ని వ్యాపారపరమైన పనులకు వాడవచ్చు. అదికూడా ఇంటి యజమాని కాకుండా ఇతరులు వాడుకోవాలి. ఇంటికి, దానికి మధ్య ఖాళీ ఇవ్వాలి. రెండూ ఆనుకొని ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చిన్నగా పెరిగిన చతురస్ర స్థలంలో నుంచి మీ ఇంటి స్థలంలోకి గేటు పెట్టకూడదు. అంటే రాకపోకలు ఉండకూడదు. మీది తూర్పువీధి కాబట్టి, దక్షిణంలో నాలుగు లేదా ఆరు అడుగుల స్థలాన్ని వదిలి ఇతరులు వాడుకునే విధంగా గది లేదా ఆఫీసు భవనం కట్టి ఇవ్వవచ్చు. దానికి అద్దెకూడా తీసుకోవచ్చు. దోషం లేదు. కానీ, మీరు మాత్రం వినియోగించవద్దు.

- Advertisement -

దక్షిణం గేటు- ఉత్తరం గేటు సమానంగా ఉండాలా? లేకున్నా ఫర్వాలేదా?

  • వి.అన్నపూర్ణ, కొడంగల్‌
    దిశనుబట్టి గేట్లు చిన్నవిగా, పెద్దవిగా పెట్టుకోవచ్చు. తూర్పులోగానీ, తూర్పు ఈశాన్యంలోగానీ గేటు పెట్టుకున్నప్పుడు పడమర గేటు అంతే వెడల్పు-ఎత్తు ఉండేలా చూసుకోవాలి. వెడల్పు తగ్గించి కూడా పెట్టొచ్చు. ఇంటి దక్షిణంలో పెద్ద గేటు పెట్టి, ఉత్తర ఈశాన్యంలో చిన్నగేటు పెట్టవద్దు. రెండు గేట్లు ఎదురెదురుగా పెడితే సమాన కొలతలతో, సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. దక్షిణంలో చిన్నగేటు, ఉత్తరంలో పెద్దగేటు పెట్టాల్సి వచ్చినప్పుడు పెద్దగేటు మధ్య కొలతకు, చిన్నగేటు మధ్య కొలతకు మార్కింగ్‌ చేసుకొని పెట్టుకోవాలి.

ఇంటి బేస్‌మెంట్‌ కంటే దక్షిణంలోని డ్రైనేజ్‌ లైన్‌ ఎత్తులో ఉండాలా?

  • ప్రభాకర్‌, జీడికల్‌

దక్షిణం, పడమర అనగానే ఏదైనా ఎత్తుగా ఉండాలనేది లోకంలో బాగా పాతుకుపోయింది. అన్నిటికీ అది వర్తించదు. ఇంటి బేస్‌మెంట్‌ కన్నా పడమర స్థలం కానీ, దక్షిణంలోని స్థలం కానీ ఎత్తుగా ఉండకూడదు. మీ డ్రైనేజ్‌ లైన్‌ దక్షిణం వైపు ఇంటి ప్లింత్‌ బీముకన్నా, కింది లెవల్‌నుంచే వెళ్లాలి. పడమర పైపుకూడా అంతే! బీము మీది ఎత్తుకు, ఆపైన అవసరం మేరకు ఇంటి ఫ్లోరింగ్‌ పెంచినపుడు దానికన్నా కిందినుంచే నీటి పారకం ఉండాలి. పైగా పడమర, దక్షిణ దిశల్లో టాయిలెట్లు ఉంటాయి. వాటి లెవల్‌ ఎత్తు ఉంటేనే కదా, డ్రైన్‌ వాటర్‌ సులభంగా వెళ్తుంది. కాబట్టి, టెక్నికల్‌గా, వాస్తు ప్రకారంగా ఇంటి బేస్‌మెంట్‌ కన్నా తక్కువ ఎత్తులోనే మురుగు
కాలువ పైప్‌లైన్‌ ఉండాలి.

కోళ్ల ఫారం షెడ్డు నిర్మాణంలో దిశ నియమాలు తప్పనిసరిగా పాటించాలా?

  • తోట రాజేందర్‌రెడ్డి, షాద్‌నగర్‌

‘మనిషి విజ్ఞాని-కోడి కాలజ్ఞాని’ అనే నానుడి మనకు తెలుసు. కోడి కూయడంతో తెల్లవారిందని నిద్ర లేచి, పనుల్లోకి దిగడం మారుమూల పల్లెల్లో నేటికీ చూడవచ్చు. కోడి జీవితం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. కాబట్టి, కోళ్లఫారాలు కూడా దిశలకు అనుగుణంగా నిర్మించాల్సి ఉంటుంది. కోళ్ల జీవనం ప్రకృతిమీద ఆధారపడి ఉంటుంది. ‘దిశ’కు అనుగుణంగా షెడ్లు లేకపోతే సరైన వెలుతురు, సూర్యరశ్మి లేక వాటి ఉత్పత్తి సామర్థ్యం కుంటుపడవచ్చు. కోడిగుడ్లు పొదుగుదలలో ‘సమ ఉష్ణోగ్రత’కు ప్రాధాన్యం ఉంటుంది. అంతేకాదు, అడ్డదిడ్డంగా షెడ్లు నిర్మిస్తే వాస్తు దోషం అవుతుంది. కోళ్లఫారం నిర్మించేటప్పుడు దిశను నిర్దిష్టంగా ఉండేలా చూసుకోవాలి. దిశ గృహాలకే కాదు, కోళ్లఫారాలకూ తప్పకుండా ఉండాలి.

మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్‌ నం: 10, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ – 500034.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మా స్థలానికి దక్షిణ నైరుతి ‘చతురస్రం’గా పెరిగింది. అందులో ఆఫీస్‌ భవనం కట్టుకోవచ్చా?
మా స్థలానికి దక్షిణ నైరుతి ‘చతురస్రం’గా పెరిగింది. అందులో ఆఫీస్‌ భవనం కట్టుకోవచ్చా?
మా స్థలానికి దక్షిణ నైరుతి ‘చతురస్రం’గా పెరిగింది. అందులో ఆఫీస్‌ భవనం కట్టుకోవచ్చా?

ట్రెండింగ్‌

Advertisement