e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home బతుకమ్మ పెండ్లంటేనే భయంగా ఉంది!

పెండ్లంటేనే భయంగా ఉంది!

పెండ్లంటేనే భయంగా ఉంది!

నాకు 27 ఏండ్లు. రెండేండ్ల నుంచి నా శరీరంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఒంటి మీద వెంట్రుకలు పల్చబడిపోతున్నాయి. తలమీద, జననాంగాల దగ్గర కూడా రాలిపోతున్నాయి. గొంతు దగ్గర కొద్దిగా వాపు కనిపిస్తున్నది. పొట్ట పెరిగింది. తరచూ తలనొప్పి, వొళ్లు నొప్పులు, ఆయాసం వస్తున్నాయి. చర్మం ఎండిపోయి కండ్ల కింద నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. ఉద్రేకం, చిరాకు, కోపం పెరుగుతున్నాయి. చాలా నీరసంగా, శక్తి కోల్పోయినట్టుగా అనిపిస్తున్నది. ఈ పరిణామాలన్నీ నన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సెక్స్‌ కోరికలు కూడా కలగడం లేదు. పెండ్లి చేసుకోవాలన్నా భయంగా ఉంది. నన్నేం చేయమంటారు? – ఓ యువకుడు

మీరు పేర్కొన్న లక్షణాలన్నీ హైపో థైరాయిడ్‌ సమస్యను సూచిస్తున్నాయి. మీరు ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించండి. వాళ్లు మీ థైరాయిడ్‌ ప్రొఫైల్‌ ఎగ్జామిన్‌ చేస్తారు. అలాగే సెక్స్‌పై మునుపటి ఉత్సాహం లేదని, కోరికలు కలగడం లేదంటున్నారు. కాబట్టి, ఆర్‌బీఎస్‌, సీబీపీ, ఎల్‌ఎఫ్‌టీ, రీనల్‌ ప్రొఫైల్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌, ఈసీజీ, ఆండోజెన్‌ ప్రొఫైల్‌, సెక్స్‌ హార్మోన్‌ లెవెల్స్‌ లాంటి పరీక్షలు చేయించాలి. థైరాయిడ్‌ ప్రొఫైల్‌తో థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉందో లేదో తెలిసిపోతుంది. సమస్య ఉంటే, జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. మందులు మొదలుపెట్టిన తర్వాత మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. థైరాయిడ్‌ సమస్యకు, సెక్స్‌ కోరికలకు సంబంధం ఉంది. ఎండోక్రైనాలజిస్ట్‌తో పాటు సెక్స్‌ సమస్య పరిష్కారానికి యూరో-ఆండ్రాలజిస్ట్‌ను, సెక్సాలజిస్ట్‌ను సంప్రదించండి. లైంగిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 

డాక్టర్‌ భారతి, సెక్సాలజిస్ట్‌, సైకోథెరపిస్ట్‌, రైస్‌ హాస్పిటల్‌, హస్తినాపురం, 

హైదరాబాద్‌. ఫోన్‌: 9849770409

ఈ మెయిల్‌: [email protected]

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెండ్లంటేనే భయంగా ఉంది!

ట్రెండింగ్‌

Advertisement