e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home బతుకమ్మ పసిడి పలుకులు

పసిడి పలుకులు

పసిడి పలుకులు

స్వచ్ఛమైన బంగారానికి సాగే గుణం ఉంటుంది. ఒక ఔన్సు (28.3 గ్రా) బంగారాన్ని దారంగా యాభై మైళ్ల దూరం వరకు సాగదీయవచ్చు. భూమ్మీద ఉన్న బంగారాన్నంతా సాగదీస్తే.. ఆ దారంతో భూగ్రహాన్ని కోటీ పదిలక్షల సార్లు చుట్టొచ్చట.

పుత్తడి అంటే ఇష్టపడని వాళ్లుంటారా! ముఖ్యంగా, మనదేశంలో ఆడవాళ్లకు బంగారంపై మక్కువ అంతా ఇంతా కాదు. ఒళ్లంతా నగలు దిగేసుకున్నా.. పిసరంత పసిడి కనిపిస్తే దానికీ చోటివ్వడానికి సిద్ధంగా ఉంటారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కొనేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే.. బంగారం మగువల జీవితాల్లో ప్రధాన భాగం, పెట్టుబడి దారుల  తొలి ఎంపిక.  పైడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

అచ్చమైన బంగారం పసుపుపచ్చని రంగులో ఉంటుంది. కానీ, పసిడిని గట్టిపర్చడానికి అందులో కలిపే లోహాలను బట్టి దాని రంగు మారుతుంది. వైట్‌ గోల్డ్‌లో నికెల్‌ గానీ, పలాడియం లోహాన్ని గానీ కలుపుతారు. రాగిని కలపడం వల్ల పుత్తడి ఎరుపు మెరుపులు సంతరించుకొని రోజ్‌గోల్డ్‌గా మారుతుంది. మార్కెట్‌లో గ్రీన్‌గోల్డ్‌ కూడా అందుబాటులో ఉంది. వెండి, జింక్‌, కాడ్మియం ఈ లోహాల్లో దేంతోనైనా జతగూడినప్పుడు బంగారం ఆకుపచ్చ ఛాయను పొదుగుకుంటుంది. బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి క్యారెట్‌ కంటెంట్‌ని 24 భాగాలుగా చేసి దాన్ని వందతో గుణిస్తారు. అలా వచ్చే శాతాన్ని బట్టి బంగారం స్వచ్ఛతను కొలుస్తారు.

  • వేల సంవత్సరాల కిందట బంగారాన్ని వైద్యంలో వాడేవారు. ప్రాచీన రోమన్లు దంతవైద్యంలో బంగారాన్ని ఉపయోగించేవారు. 20వ శతాబ్దంలోనూ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ పేషంట్లకు నొప్పి, వాపు తగ్గించడానికి గోల్డ్‌ కాంపౌండ్స్‌ కలిపిన ఇంట్రా మస్క్యులర్‌ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. కారణం బంగారంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. అంతేకాదు ఈ మధ్య ఆంకాలజిస్ట్‌లు క్యాన్సర్‌ ట్యూమర్లు తగ్గించడానికీ గోల్డ్‌ కాంపౌండ్స్‌ని వాడుతున్నారు. 
  • ప్రపంచం మొత్తంలో ఉన్న బంగారంలో ఎక్కువశాతం చైనా గనుల్లో నుంచి తీసిందే. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రత్యేక లక్షణాలున్న గోల్డ్‌ క్రిస్టల్‌ మాత్రం కొన్ని దశాబ్దాలక్రితం వెనిజులా దేశంలో వెలుగు చూసింది.
  • ఇప్పటికే ప్రపంచంలోని 2,44,000 టన్నుల బంగారంలో 80శాతం తోడేశాం. అయితే సముద్రపు నీరు, సీబెడ్స్‌లో రెండు కోట్ల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. కానీ, పర్యావరణ ఆంక్షల కారణంగా ఆ సంపదను ముట్టుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి.
  • నోబెల్‌ ప్రైజ్‌ పతకంలో మాత్రం ఇప్పటికీ బంగారాన్నే ఉపయోగిస్తున్నారు. అయితే, 1980లో 23 క్యారెట్లు కాకుండా దాన్ని 18 క్యారెట్ల కోటింగ్‌కు తగ్గించారు. ఏదేమైనా ఒక మెడల్‌ తయారీకి దాదాపు రూ.6 లక్షలు విలువ చేసే బంగారాన్ని వాడుతారట!
  • ప్రస్తుతం గోల్డ్‌ బార్స్‌, కాయిన్స్‌ ట్రేడింగ్‌లో ‘బులియన్‌’ అనే పదం విరివిగా వాడుతున్నారు. నిజానికి ఆ పదం లాటిన్‌ భాషలోని ‘బాయిల్‌’ నుంచి వచ్చింది. బంగారంలోని మలినాలను తొలగించడానికి 5,173 డిగ్రీల ఫారిన్‌హీట్‌ దగ్గర దాన్ని వేడి చేస్తారు.
  • స్పేస్‌ సూట్‌, స్పేస్‌క్రాఫ్ట్‌కు గోల్డ్‌ కోటింగ్‌ వేస్తారు. సూర్యుడి నుంచి వచ్చే ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ నుంచి రక్షణ కోసం బంగారు పైపూత వాడతారు. అలాగే నాసాలో ఏ వస్తువును చల్లబర్చాలన్నా గోల్డ్‌ కోటింగే వేస్తారు.
  • బంగారం స్వచ్ఛమైందో, కల్తీదో తెలుసుకోవడానికి చాలామంది దాన్ని కొరికి చూస్తుంటారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవగానే క్రీడాకారులు దాన్ని కొరకడం మనం చాలాసార్లు చూసుంటాం. స్వచ్ఛమైన బంగారం మృదువుగా ఉంటుందనే అలా పరీక్షిస్తుంటారు. కానీ, బంగారంతో పాటు సృష్టిలో చాలా లోహాలు మృదువుగా ఉంటాయి. అందుకే, కొరకడం వల్ల పుత్తడి స్వచ్ఛత తెలియదు.1912 స్టాక్‌హోమ్‌లో జరిగిన సమ్మర్‌ గేమ్స్‌ నుంచీ గోల్డ్‌ మెడల్స్‌ తయారీలో బంగారాన్ని వినియోగించడం లేదు. వీటిని వెండితోనే చేస్తారు. కాకపోతే బంగారం పూత ఉంటుంది. అయితే, 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌ నుంచీ  కొన్ని పతకాల్లో 1.2 శాతం బంగారాన్ని కలుపుతున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పసిడి పలుకులు
పసిడి పలుకులు
పసిడి పలుకులు

ట్రెండింగ్‌

Advertisement