e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home బతుకమ్మ పలుకుబడులు

పలుకుబడులు

పలుకుబడులు

తాతిపరం తనను కాస్తది..ఓపిక ఒకరిని కాస్తది

ఒక మనిషికి నీతి, నిజాయతీ ఎంత ముఖ్యమో ఓపిక కూడా అంతే అవసరం. పరిస్థితులకు అనుగుణంగా ఓపిక లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే, జీవితంలో నీతిగా బతికితే ఆ నిజాయతీ ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. ఒక మనిషిలోని సద్గుణాలు ఇవే. వీటి గురించి చెప్పే సందర్భంలో వాడే సామెతే ‘తాతిపరం తనను కాస్తది, ఓపిక ఒకరిని కాస్తది’. ఇందులో తాతిపరం(తాత్పర్యం) అంటే నీతి, ధర్మం. నీతిగా బతికితే ఏ ఇబ్బందులూ రావు. పైగా నిజాయతీ రక్షగా ఉంటుంది. అలాగే, ఓపిక కూడా ఎంతో అవసరం. మన ఓపిక ఎదుటి మనిషికి రక్షగా ఉంటుంది. ఓపిక లేకనే ఎన్నో కుటుంబాలు, కాపురాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. అందుకే ఓపికను మించిన సద్గుణం లేదంటారు పెద్దలు. 

మన సామెతలు 

ఈ పిల్లగాడికి ఈనెం లేదు.. ఇగురం లేదు

పలుకుబడులు

‘పిల్లగాడికి ఈనెం లేదు. ఇగురం లేదు. ఒక పని జెప్తె నాలుగు పనులు ఎదురు జేపిస్తడు..’ ఈ పదబంధంలో కొత్తపదం ఈనెం. అంటే  పద్ధతి, ప్రవర్తన, తీరు, మర్యాద వంటి అర్థాలు వస్తాయి. ‘పిల్ల ఈనెం తప్పింది. పెద్దోళ్ల ముంగట అట్ల మాట్లాడొద్దు అంటే ఇంటలేదు..’ వంటి సందర్భాలను అనుసరించి పదాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈనెం అనే పదబంధాన్ని పాలమూరు చుట్టుపక్కల విరివిగా ఉపయోగిస్తారు.

సాట్ల తవుడు పోసి కుక్కలకు.. 

పలుకుబడులు

ఇద్దరి మధ్య తగువు పెట్టి, వేడుక చూసేవాళ్లను ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. ఇలా గొడవలు పెట్టేవారు ఎక్కడో ఉండరు.. మన చుట్టుపక్కలే ఉంటారు. ఒకరి మాటలు ఒకరికి కల్పించి చెబుతూ ఇద్దరి మధ్యా వైరం పుట్టిస్తారు. అలాంటి వ్యక్తులు మన ఆత్మీయులకు తారసపడ్డప్పుడు ‘రేయ్‌! వాడితో జాగ్రత్త. సాట్ల తవుడు పోసి.. కుక్కలకు తాకులాట పెట్టినట్టు జేస్తడు! నీ ఇష్టం’ అని హెచ్చరిస్తారు. ఇలాంటి వ్యక్తులు ఇరువర్గాల మధ్య లొల్లి పుట్టించే రకాలు. పక్కనోళ్లు కలహాలలో  మునిగితేలుతుంటేనే, వీరి పబ్బం గడుస్తుంది. 

కొత్త పిస్పి.. కొత్త పుట్టలు 

పలుకుబడులు

‘తాతీల్లు కాంగనే సోప తెరుస్తరు. కొత్త వయ్యిలు కొనాలె. అవ్వీటికి పుట్టలు ఏసుకోవాలె. వయ్యిలు పెట్టుకోను కొత్త పిస్పికొనాలే’ మన మట్టిమాటలకు ప్రాణం పోస్తున్న ఇలాంటి పలుకుబడులు విన్నప్పుడు ఏదో తెలియని హాయి, ఆనందం. ఈ పదబంధంలోని పదాలకు అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.. తాతీల్లు(సెలవులు) కాంగనే (అయిపోగానే) సోప (బడి) తెరుస్తరు. కొత్త వయ్యిలు (పుస్తకాలు) కొనాలె. అవ్వీటికి పుట్టలు (వాటికి కవర్లు, అట్టలు) ఏసుకోవాలె. వయ్యిలు పెట్టుకోను (పెట్టుకోవటానికి) కొత్త పిస్పి (సంచి/బ్యాగు) కొనాలే. కొవిడ్‌ తర్వాత, కొత్తగా బడులు స్టార్ట్‌ అయితున్నయ్‌ కదా.. భావితరాలకు ఇసొంటి పదాలను పరిచయం చేద్దాం. మన అమ్మభాషను కాపాడుకుందాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పలుకుబడులు

ట్రెండింగ్‌

Advertisement