e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home పలుకుబడులు పదబంధం: ‘ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు’

పదబంధం: ‘ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు’

‘ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు’

ఏదైనా ఒక విషయం మీద వాదన జరుగుతున్నప్పుడు, ఎదుటివారు తాము చెప్పిన మాట వినకపోతే.. కొంతమంది గమ్మున ఉండిపోతారు. ఆవేశానికి పోరు. ఇలాంటి సందర్భానికి సరిపోయే సామెతే ‘ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడిగుండంత సుఖం లేదు’ అనేది. అత్తాకోడళ్ల మధ్య ఒక్కోసారి విపరీతమైన గొడవ జరుగుతుంది. ఆ సమయంలో భర్త లేదా మామ వస్తే.. కథ వేరేలా మారిపోతుంది. ఎందుకంటే, ఇద్దరిలో ఎవరికీ చెప్పలేని పరిస్థితి వారిది. ఒక్కోసారి పొర
పాటున కలుగజేసుకున్నా.. ఆ తర్వాత ‘ఊరకుండటమే మంచిది’ అన్న నిర్ణయానికి వచ్చేస్తారు. నిజమే, ఊరుకున్నంత ఉత్తమం ఉండదు మరి! ఇక ‘బోడిగుండంత సుఖం’ అంటే, జుట్టు
ఉంటే ఎన్నో సమస్యలు.. చెమట, దురద, చుండ్రు, పేలు. నిత్యం తలస్నానం చేయాలి. ఈ బాధలన్నీ గుండు బాసులకు ఉండవు. అందుకే బోడి గుండంత సుఖం లేదంటారు.

- Advertisement -

‘చౌదాపుడి’ సరుకులు తెచ్చిండ్రా?
పుట్టుక నుంచి చావు వరకూ అన్ని సందర్భాల్లో అవసరమైన కిరాణా సరుకులు లభించే చోటును ‘చౌదాపుడి దుకాణం’ అంటారు. చౌదాపుడి సరుకులంటే 14 రకాల దినుసుల సమాహారం. హిందీలో ‘చౌదా’ అంటే పద్నాలుగు. ఆయా రకాల దినుసులను వేర్వేరుగా చిన్న చిన్న పొట్లాల్లో కడతారు కాబట్టి ‘చౌదాపుడి’గా పిలుస్తారు. కొన్నిప్రాంతాల్లో ఈ దినుసుల సమాహారాన్ని ‘బాలింత వెచ్చాలు’,
‘బాలింత మూలికలు’ ‘బాలింత పత్యం’ అనీ పిలుస్తారు. 14 రకాల ఆయుర్వేద
దినుసులను దంచి, పొడిచేసి బాలింతలకు ఇస్తారు. వీటిలో లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పిప్పళ్లు, ఇలాచి వగైరా ఉంటాయి. ఆయుర్వేదానికి సంబంధించిన మూలికలు, వస్తువులు, వేర్లు, ద్రవ్యాలు, పొడులు మొదలైన 200 రకాల వస్తువులు చౌదాపుడి దుకాణాల్లో దొరుకుతాయి.

‘అరవై ఏండ్లోని ఆలి చావొద్దు..’
‘అరవై ఏండ్లోని ఆలి చావొద్దు.. ఇరవై ఏండ్లోనికి పెత్తనమియ్యొద్దు’ అనే సామెత కూడా జీవితానుభవంలోంచి పుట్టిందే. అరవై ఏండ్లు దాటిన వ్యక్తికి తోడు అవసరం. ఆసరాగా ఉన్న ఆడమనిషి చనిపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తోడులేని పక్షిలా ఒంటరిగా బతుకీడ్చడం బాధాకరం. అందుకే, అరవై ఏండ్లోనికి ఆలి చావొద్దంటరు. అదే సమయంలో ఇరవై ఏండ్లోనికి పెత్తనం ఇవ్వొద్దని కూడా చెప్పారు. ఎందుకంటే, అప్పుడే కౌమార దశను దాటుకొని వచ్చిన నవ యువకుడికి పెత్తనం అప్పగిస్తే దుందుడుకుగా వ్యవహరిస్తాడు. అనుభవరాహిత్యంతో వ్యవహరిస్తాడు. దీనివల్ల,నష్టాలపాలై ఇబ్బందులుపడే ఆస్కారం ఉంది.

డప్పు రవి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement