e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home బతుకమ్మ నోర్లేని దయ్యమచ్చి ఊరు గాలవెట్టిందట’

నోర్లేని దయ్యమచ్చి ఊరు గాలవెట్టిందట’

నోర్లేని దయ్యమచ్చి ఊరు గాలవెట్టిందట’

‘నోర్లేని దయ్యమచ్చి 

ఊరు గాలవెట్టిందట’

కొంతమందిని చూస్తే.. ‘అరే పాపం వీడెంత అమాయకుడు. నోట్లో నాలుక లేనోడు’ అని జాలి పడుతూ ఉంటాం. అలాంటి వారిలో కొందరు పైకి అమాయకంగా నటిస్తూ లోపల కుళ్లుబుద్ధితో ఇతరుల మధ్య వైరం పెడుతుంటారు. అంతేకాదు, కుటుంబంలో, చుట్టుపక్కల  కొత్త సమస్యలు కలుగజేస్తుంటారు. ఇలాంటి వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు.. ‘నోర్లేని దయ్యమచ్చి ఊరు గాలవెట్టిందట’ అనే సామెతను ప్రయోగిస్తుంటారు. అప్పటి వరకూ ఎంతో అమాయకంగా నటిస్తూ, ఏమీ ఎరుగనట్లు ముఖం పెడుతూ.. నమ్మినవాళ్లను నట్టేట ముంచే వాళ్లు మన చుట్టూ చాలామందే ఉంటారు. తాతాల కాలంలో ఏమో గానీ, ఈ రోజుల్లో ఇసొంటోళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మన సామెతలు 

తాతకు ముంతంబలి 

మనవనికి తెడ్డంబలి

నోర్లేని దయ్యమచ్చి ఊరు గాలవెట్టిందట’

భవిష్యత్తు గురించి ఆలోచించకుండా డబ్బు/ఆహారం విచ్చలవిడిగా వృథా చేసే సందర్భంలో ఈ సామెతను వాడారు జానపదులు.  ‘తాతకు ముంతంబలి మనవనికి తెడ్డంబలి’.. అంటే తనకు అందుబాటులో ఉన్నవనరులను ఉపయోగించుకొని..  తాత అంబలిని ముంతలో తాగేవాడు. అతని కొడుకు మాత్రం తండ్రి అండను చూసుకొని విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ఆ ప్రభావం. వారసత్వంగా అతని కొడుకుపైనా పడింది. వెరసి అతని తెడ్డు (వంటకు ఉపయోగించే గరిటె వంటిది)లో అంబలి తాగాల్సి వచ్చింది. ప్రకృతి ప్రసాదించిన ఏ వస్తువునైనా  సరే అవసరానికి మించి వాడితే ఆ ప్రభావం ముందు తరాలపై పడుతుందనే సందర్భంలో వాడే సామెత ఇది. ఇలాంటిదే మరొకటి.. ‘కల్లం ఉన్నన్నొద్దులు గంజి’ అనేది. కల్లం లేనినాడు పస్తులు పండాలి. అందుకే, దేనినైనా చాలా జాగ్రత్తగా, అవసరానికి సరిపడా మాత్రమే వాడాలని అంటారు. 

ఆనికి గాడి రొప్పుడు.. 

నోర్లేని దయ్యమచ్చి ఊరు గాలవెట్టిందట’

‘ఆనికి గాడి రొప్పుడు పైలి నుంచె ఎర్క! బగ్గ రువ్వడి రొప్పెడిది గాని, గాడి కుసయితె తక్లిఫైతదని తిరాం బోవట్టిండు బిడ్డ’.. లాంటి పదబంధాలు మన పలుకుబడులకు ప్రాణాలు. పల్లెమట్టి వాసనను తలపించే ఇలాంటి పదాలను నవతరం తప్పకుండా తెలుసుకోవాలి కూడా. ఈ పదబంధం అర్థమేమంటే.. ఆనికి= వాడికి, గాడి= జీపు/కారు, రొప్పుడు= నడపడం, పైలి నుంచె= మొదటి నుంచే, ఎర్క= తెలుసు. బగ్గ= చాలా, రువ్వడి= వేగంగా, రొప్పడిది గానీ=నడిపేదే కానీ, గాడి =బండి, కుసయితే = ఫెయిలైతే, తక్లిఫైతదని=కష్టమైతదని, తిరాం= నిదానం, బోవట్టిండు బిడ్డ = పోతున్నాడు బిడ్డ. ఎంత మాధుర్యం ..మన తల్లి భాషలో!

అర్థ వివరణ

పొద్దు మొకం 

నోర్లేని దయ్యమచ్చి ఊరు గాలవెట్టిందట’

‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అనేది మనందరికీ తెలిసిన సామెత. సమయం, సందర్భం లేకుండా మెప్పుకోసం పాకులాడేవారిని ఈ సామెత ప్రయోగించి దెప్పిపొడుస్తారు.  తెలంగాణ ప్రాంతంలో పొద్దులను దిక్కులతో పోల్చారు జానపదులు. గంగానది ఉత్తర భారతాన ఉంది కాబట్టి.. ఉత్తరాన్ని గంగ మొకం అన్నారు. దక్షిణం దిక్కు యమస్థానమని పేరుండటంతో ఆ దిశను యమముఖం అని పిలుస్తారు. సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కును పొద్దు మొకం అన్నారు. పొద్దు మొకం అంటే తూర్పు దిక్కని అర్థం.

Advertisement
నోర్లేని దయ్యమచ్చి ఊరు గాలవెట్టిందట’
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement