e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home బతుకమ్మ టెడ్డీబేర్‌ మ్యూజియం ఎక్కడ ఉందో మీకు తెలుసా ?

టెడ్డీబేర్‌ మ్యూజియం ఎక్కడ ఉందో మీకు తెలుసా ?

పిల్లల అరల్లో కచ్చితంగా కనిపించే బొమ్మ టెడ్డీబేర్‌. పిల్లలున్న ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో ఓ టెడ్డీబేర్‌ దర్శనమిస్తుంది. పిల్లలకు టెడ్డీలంటే ప్రాణం. ముద్దుచేస్తారు, ఎత్తుకుంటారు, మాట్లాడతారు, దెబ్బలాడతారు. టెడ్డీబేర్‌కు థాయ్‌లాండ్‌లోని పటాయాలో ఓ పెద్ద మ్యూజియమే ఉంది. ఇక్కడ కళ్లు చెదిరే టెడ్డీలున్నాయి. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా..

‘ట్రావెల్‌ ట్రెజర్‌ హంటింగ్‌ విత్‌ టెడ్డీబేర్‌’ అనే కాన్సెప్ట్‌తో ఈ టెడ్డీ మ్యూజియాన్ని నిర్మించారు. ఇందులో నలభై మీటర్ల పొడవుండే డ్రాగన్‌ బోట్‌ ఉంటుంది. ఆగ్నేయాసియాలో 2,500 చ.మీ విస్తీర్ణంలో నిర్మించిన మొట్టమొదటి టెడ్డీ ప్రదర్శనశాల ఇదే. ఈ మ్యూజియంలో అనేక రంగుల్లో, పరిమాణాల్లో, చిత్రవిచిత్రమైన పోజుల్లో టెడ్డీబేర్లను చూడవచ్చు. ఇన్‌కా, డైనోసార్‌, ఫాజిల్‌, ఆఫ్రికా, థాయ్‌లాండ్‌, అండర్‌ సీ, ఎస్కిమో, శాంటా, స్పేస్‌, ఫెయిరీ టెయిల్‌, చైనా, యూరోప్‌.. ఇలా పన్నెండు భిన్నమైన జోన్లు ఉంటాయి. ప్రతి జోన్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను కండ్లకు కట్టినట్టు చూపించేలా వీటిని రూపొందించారు. కొన్నిటిని ముట్టుకుంటే, వింత శబ్దాలతోపాటు రంగురంగుల కాంతినీ వెదజల్లుతాయి. మరికొన్నయితే, నిజమైన బేర్లేమో అనేంతగా భ్రమింపజేస్తాయి. శని, ఆదివారాల్లో జరిగే ప్రత్యేక ప్రదర్శనలో ఫెయిరీ టెయిల్‌ జోన్‌లోని టెడ్డీబేర్లను ప్రదర్శిస్తారు. ఆ బొమ్మల నడుమ కాసేపు కూర్చునే అవకాశమూ ఉంది. ఆవరణలోని గిఫ్ట్‌షాప్‌లో నచ్చిన టెడ్డీలను కొని తెచ్చుకోవచ్చు. భలే ఉంది కదూ!

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana