e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home బతుకమ్మ గ్లామర్‌ సాహిబా!

గ్లామర్‌ సాహిబా!

గ్లామర్‌ సాహిబా!

అందం, అభినయం కలబోసుకున్న అతికొద్దిమంది హీరోయిన్ల లిస్ట్‌లో చెన్నై చంద్రిక.. నివేదా థామస్‌ పేరు తప్పకుండా ఉంటుంది. చిన్నప్పటినుంచే సీరియళ్ళు, సినిమాలు చేస్తూ దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. ‘జంటిల్‌మన్‌’తో టాలీవుడ్‌కు పరిచయమైన నివేదా కథా ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ, కెరీర్‌ పరుగులో ముందుంటున్నది. తాజాగా ‘వకీల్‌ సాబ్‌’తో మరోసారి ‘భేష్‌’ అనిపించుకున్న నివేదా గురించిన ముచ్చట్లు..

  • కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటుంది నివేదా. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, అందరికీ గుర్తుండి పోయే పాత్రలు పోషించింది. తనకు ఎమోషనల్‌ సీన్లలో కన్నీళ్లు పెట్టించడం తెలుసు, అల్లరిచూపులతో ఆట పట్టించడమూ తెలుసు. అందుకే, దర్శక నిర్మాతలకు అంత అభిమానం.
  • కేరళ మూలాలున్నా, నివేదా పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలోనే. ఎనిమిదేండ్లకే బాలనటిగా తెరంగేట్రం చేసింది. అప్పటినుంచీ తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూనే ఉంది. 2008లో ఉత్తమ బాలనటిగా కేరళ ప్రభుత్వ అవార్డు కూడా అందుకున్నది. ఎంత గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నా, నివేదా చదువును పక్కన పెట్టలేదు. ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేసింది.
  • నివేదా మలయాళంతోపాటు తమిళం, తెలుగు మాట్లాడగలదు. ఫ్రెంచ్‌, ఇంగ్లిష్‌ భాషల్లోనూ ప్రావీణ్యం ఉంది. పాటలు చక్కగా పాడుతుంది. ట్విట్టర్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఆమెను దాదాపు 50 లక్షల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. సినిమాల సంగతులు, ఫొటోషూట్‌ల విశేషాలతోపాటు ఎప్పటికప్పుడు తన భావాలను అభిమానులతో పంచుకుంటుంది.
  • హీరోయిన్‌గానే కాకుండా ప్రముఖ హీరోలకు చెల్లిగా, రజినీకాంత్‌కు కూతురిగా నటించింది నివేదా. మంచి పాత్ర అయితే, రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా పనిచేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించిందీ సొట్టబుగ్గల చిన్నది.
  • నివేదాకు చిన్నప్పట్నించీ టీచర్‌ ఉద్యోగమంటే ఇష్టం. హీరోయిన్‌ కాకపోయి ఉంటే కచ్చితంగా ఆర్కిటెక్చర్‌ ప్రొఫెసర్‌గానో, ఆస్ట్రోనాట్‌గానో సెటిలయ్యేదాన్నని చెబుతుంటుంది. తాజాగా ‘వకీల్‌ సాబ్‌’లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. సినిమాలో హావభావాలను అద్భుతంగా పండించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలకు కథలు వింటున్నది నివేదా. ఇంకా ఏ కొత్త ప్రాజెక్టుకూ ఓకే చెప్పలేదు. ఈ విలక్షణ నటి, వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.
Advertisement
గ్లామర్‌ సాహిబా!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement