e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home బతుకమ్మ క్యాన్సర్‌ లక్షణం కావచ్చు!

క్యాన్సర్‌ లక్షణం కావచ్చు!

నలభై దాటిన మహిళల్లో, కలయిక తరువాత యోని నుంచి రక్తస్రావం కావడాన్ని క్యాన్సర్‌తోపాటు, ఇతర తీవ్ర వ్యాధులకు సంకేతంగా చెప్పవచ్చు. సమస్యకు మూల కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం. సర్వైకల్‌ డిస్‌ప్లేసియా: ఇది గర్భాశయ ముఖద్వారాన్ని కప్పి ఉంచే ఎపిథీలియల్‌ కణాలలో.. క్యాన్సర్‌కు ముందు వచ్చే మార్పులను సూచించే స్థితి. చికిత్సలో భాగంగా గర్భాశయ ముఖద్వార ద్రవాలను పాప్‌ స్మియర్‌, బయాప్సీల ద్వారా పరీక్షించి, ప్రీ క్యాన్సర్‌ కణాలున్నంత మేరా కోనైజేషన్‌ అనే ఆపరేషన్‌ ద్వారా, క్రయో సర్జరీ ద్వారా తొలగించవచ్చు.

క్లామోమైడియా: సుఖవ్యాధుల్లో (ఎస్‌టీడీ) ఒక బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఇది. వీర్యం, రక్తం, యోని స్రావాల వల్ల వస్తుంది.

- Advertisement -

గనేరియా: ఇది కూడా సుఖవ్యాధుల్లో ఒకటి. ముదిరితే గర్భాశయ ముఖద్వార, సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.

సర్విసైటిస్‌: గర్భాశయ ముఖద్వారానికి, అంటే సర్విక్స్‌కు బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌ల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్‌. దీర్ఘకాలంలో క్యాన్సర్‌గా మారవచ్చు.

సర్వైకల్‌ పాలిప్‌: గర్భాశయ ముఖద్వారపు పొరల్లో లేదా నాళంలో ఎరుపు లేదా వంకాయ రంగులో మెత్తటి వేర్లవంటి బుడిపెల్ని ‘సర్వైకల్‌ పాలిప్‌’ అంటారు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తీసేయకపోతే క్యాన్సర్‌కి దారి తీయవచ్చు.

ట్రైకోమనియాసిస్‌: ప్రోటోజోవా ఫంగస్‌ వల్ల వచ్చే సుఖవ్యాధి ఇది. తల్లి నుంచి బిడ్డకు వచ్చే ఆస్కారం ఉంటుంది. అపరిశుభ్రమైన పరిసరాలు, టాయిలెట్ల వల్ల కూడా వ్యాపిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోయినా వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే, దీర్ఘకాలంలో సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారి తీస్తుంది.

వ్జైనల్‌ ఈస్ట్‌ ఇన్ఫెక్షన్‌: యోని నాళంలో, సెర్విక్స్‌ చుట్టూ ఫంగస్‌ పెరిగిపోతుంది. తీవ్రమైన దురదతో పాటు తెల్లని స్రావాలు విడుదల అవుతాయి.

ఎండోమెట్రైటిస్‌ లేక ఎడినోమయోసిస్‌: గర్భాశయ లోపలి పొర అయిన ఎండోమెట్రియమ్‌కు ఇన్ఫెక్షన్‌ సోకుతుంది.

యుటిరైన్‌ పాలిప్‌: గర్భాశయపు ఎండోమెట్రియమ్‌ పొర పెరిగి బుడిపెలుగా పొడుచుకు వస్తుంది. ఇది క్యాన్సర్‌గా మారే అవకాశం తక్కువ.

డా. భారతి (ఎమ్మెస్‌)
మారిటల్‌ కౌన్సిలర్‌, సైకోథెరపిస్ట్‌,
జయా హాస్పిటల్‌
బీ.ఎన్‌. రెడ్డి నగర్‌ క్రాస్‌రోడ్‌, హైదరాబాద్‌
bharathid506@gmail.com, 9908383910

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement