e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home బతుకమ్మ కన్నుగీటుతో చెక్‌

కన్నుగీటుతో చెక్‌

కన్నుగీటుతో చెక్‌

రెండేండ్ల కింద ఓ కేరళ కుట్టి కన్ను కొట్టింది. ఆ కన్నుగీటు తొలిప్రేమకు గీటురాయిగా మారింది. ఈ కొమ్మ కనుబొమలు ఆడించిన వైనం ప్రణయసీమలో షికారు చేసే కుర్రకారుకు మత్తెక్కించింది. ఆ అమ్మడు చేతి తుపాకీ నుంచి వచ్చిన లవ్‌ తూటా కోట్ల హృదయాలను కొల్లగొట్టింది. ఒక్క షాట్‌తోనే యువ భారతానికి పిచ్చెక్కించిన ఆ భామే.. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ‘వింక్‌గాళ్‌’గా పాపులర్‌ అయిన మలబారు సుందరి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరోసారి యంగిస్థాన్‌ కు ‘చెక్‌’ చెప్పింది.

మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా వారియర్‌ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ‘ఒరు ఆడార్‌ లవ్‌’ చిత్రంలో ఆమె కన్ను కొట్టిన తీరు. ఆ ఒక్క సీన్‌తోనే రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయింది. ఒకానొక సందర్భంలో దర్శక నిర్మాతలు ఆమె జపం చేశారు కూడా. అయితే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ప్రియా వారియర్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ‘తన్హా’, ‘నీ వానమ్‌ నాన్‌ మజ్‌హై’, ‘కాదలాసు తోని’ తదితర చిన్న చిత్రాల్లో నటించింది.

నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ 

యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్‌’లో కథానాయికగా నటించింది ప్రియ. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అప్పటికే చంద్రశేఖర్‌ యేలేటి రూపొందించిన ‘విస్మయం’ చూసిన ప్రియా ..‘చెక్‌’ సినిమా కోసం అడగ్గానే ఒప్పుకొందట. దక్షిణాదిలో తమిళం తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లో నటించిన ఈ భామ హిందీలోనూ ఓ సినిమా చేసింది. ఒక భాషకి పరిమితం కాకుండా… ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తానంటున్నది ప్రియ.

ప్రియా వారియర్‌కు నటనతోపాటు నృత్యం, సంగీతంలోనూ ప్రవేశం ఉంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంది. బాల్యం నుంచీ తనకు నటనంటే ఇష్టం. అద్దం ముందు నిలబడి 

డైలాగులు చెప్పేదట. కొన్ని లఘు చిత్రాల్లోనూ నటించింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియా వారియర్‌  హాట్‌హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ప్రేక్షకులు ‘వింక్‌ గాళ్‌’ అనే పిలుస్తున్నారనీ.. ఆ గుర్తింపు తనకు అదృష్టమే కానీ, ఇక నుంచి మంచి నటనతో ఆ పేరు మార్చుకోవాలని ఉందనీ అంటున్నది ప్రియ. 

సినిమాతో సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చింది ప్రియ. ఆమె తండ్రి సెంట్రల్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. ప్రియకి ఓ తమ్ముడుఉన్నాడు. సాధారణ అమ్మాయిల్లానే తనూ ఉంటానని, ఎవరైనా తోడుంటే కబుర్లతో కాలం గడిపేస్తాననీ అంటున్నది ప్రియ.

ప్రియా వారియర్‌కు పాడటమంటే ఇష్టం. తను నటించిన కన్నడ చిత్రం ‘విష్ణుప్రియ’లో ఓ పాట కూడా పాడింది. అంతేకాదు.. మలయాళం, తెలుగు, హిందీ భాషల్లోనూ స్పెషల్‌ ఆల్బమ్స్‌లో ఆలపించింది. సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని అంటున్నది ఈ కేరళ కుట్టి.

‘లవర్స్‌ డే’లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్‌ అవడంతో సోషల్‌ మీడియాలో ప్రియ ఫాలోవర్స్‌ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా విడుదలకి ముందే చాలా పాపులర్‌ అయిపోయింది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోల ప్రశంసలందుకుంది. అప్పుడే తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందనుకున్నారంతా. కానీ, రెండేండ్ల తర్వాత ఇలా నితిన్‌ ‘చెక్‌’తో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కన్నుగీటుతో చెక్‌

ట్రెండింగ్‌

Advertisement