e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home బతుకమ్మ ఇంట్లో డబుల్‌ హైట్‌మీద బెడ్‌రూమ్‌ రావచ్చా?

ఇంట్లో డబుల్‌ హైట్‌మీద బెడ్‌రూమ్‌ రావచ్చా?

 • దొంతుల సుమతి, మేడ్చల్‌
  ఇంట్లో డబుల్‌ హైట్‌ పెట్టారూ అంటే, మీది డూప్లెక్స్‌ ఇల్లు అని అర్థం అవుతున్నది. మళ్లీ డబుల్‌ హైట్‌ మీద గది అంటున్నారంటే, దానిపైన ఇంకో ఫ్లోర్‌ కడుతున్నారా? అలాంటప్పుడు ఆ ఇంటిని బయట నుంచి మెట్లు పెట్టుకొని వాడుకోవాలి. అప్పుడు అది డూప్లెక్స్‌ ఇంట్లో భాగం కాకుండా ఉంటుంది. ఆ ఇంటికి మెట్లు ఆగ్నేయం లేదా వాయవ్యంలో వేసుకోవచ్చు. డబుల్‌ హైట్‌మీద వేసే కప్పు కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. సహజంగా డబుల్‌హైట్‌ ఉత్తరంలోగానీ, తూర్పులోగానీ వస్తుంటుంది. ఆ చోట పడకగది రావడం మంచిది కాదు. అది హాలులో భాగంగా ఉంటేనే మంచిది. పైన మరొక ఫ్లోర్‌ ప్లాన్‌ చేస్తున్నప్పుడు పడక గదులను దక్షిణం-నైరుతి అలాగే వాయవ్యం దిశల్లో చక్కగా నిర్మించుకోవచ్చు. అప్పుడు తూర్పు, ఉత్తర భాగాల్లో హాలు వచ్చి ఇల్లు అందంగా ఉంటుంది.

పూజగదిలో ‘శంఖం’ పెట్టుకోవాలా?

 • వెలిదెండ శ్రీలత, చేర్యాల
  అభిషేక సమయంలో శంఖువును వాడుతూ ఉంటారు. శంఖాన్ని పూరించడం అన్నది ఆలయాల్లో ఎక్కువగా చూస్తుంటాం. శంఖం శంకరుడికి ప్రీతికరమైందని చెబుతారు. అందుకే, దీనిని పూజగదిలో ఉంచుతుంటారు. శంఖంలోని నీటికి ప్రత్యేక శక్తి వస్తుందని
  పెద్దలమాట. అందుకే, ‘శంఖంలో పోస్తేనే తీర్థం’ అన్న మాట వాడుకలో ఉంది. సృష్టి చేసిన అద్భత నిర్మాణాల్లో శంఖం ఒకటి. కొన్ని వస్తువులకు కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయి. శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే సముద్రహోరు వినబడుతుంది. ఇలా శంఖం ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే, శంఖాన్ని పూజామందిరంలో పెట్టుకోవాలా, వద్దా అనేది మీరు ఆచరించే పూజా విధానాన్నిబట్టి ఉంటుంది. పూరించే శంఖాన్ని కాకుండా ‘దక్షిణావర్త’ శంఖాన్ని పూజలో పెడుతారు. శంఖం కొసభాగం తూర్పువైపుగా ఉంచుతూ పళ్లెంలో పెట్టాలి. పగిలిన, కొసలు విరిగిన శంఖాలను పూజలో ఉంచరాదు.

వీధిశూల ఉన్న ఇంటి మధ్యలో గోడ కట్టి రెండు భాగాలుగా విభజిస్తే దోషం పోతుందా?

 • రేగుల సుభాష్‌, కొంపల్లి
  వీధిపోటు ఉన్న ఇంటిని బాగు చేయాలంటే అది ఏ దిశలో ఎంతమేరకు పడుతుందో ముందు నిర్ధారించుకోవాలి. వీధిశూలకు విరుగుడుగా మధ్యలో గోడ కట్టి ఇంటిని రెండుగా చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. శూల తొలగిపోవడం అవసరం. దక్షిణ నైరుతిలో వీధిపోటు ఉంటే, అంతమేరకు ఇంటిని తొలగిస్తూ వీధిని లోపలికి తీసుకోవడం ఒక పద్ధతి. కానీ, తద్వారా ఆ ఇంటిని పూర్తిగా కూల్చాల్సి రావచ్చు. మిగతా భాగంలోనూ చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా రెండు భాగాలుగా విడగొట్టాలంటే, ఆ వీధిశూల పడమరలో గానీ, దక్షిణంలో గానీ వచ్చినప్పుడు అంత మేరకు ఓపెన్‌ చేసి ఇంటిని రెండుగా వేరుచేయాలి. అప్పుడు వీధిపోటు దోషం పోతుంది. ఏదేమైనా మీ ఇష్టం వచ్చినట్టు కాకుండా, తెలిసిన వారిచేత సరైన పద్ధతిలో సరిచేసుకోండి. మార్పునకు అవకాశం ఉంటేనే పని మొదలుపెట్టండి. అంతేకానీ, సొంతవైద్యం పనికిరాదు.
- Advertisement -

దక్షిణం గోడ (ప్రహరీ) కూలిపోయింది. ఇప్పుడు దానిని పునర్నిర్మించాలనుకుంటున్నాం. అయితే ఈ గోడను మిగతా వాటికన్నా లోతునుంచి కట్టుకుంటూ రావాలా?

 • ఆదిబట్ల శ్రీనివాస్‌, ఆలేరు

ఇంటి కాంపౌండ్‌ గోడ ఏ దిక్కునైనా పడిపోతే, అక్కడ నేల స్వభావాన్నిబట్టి అవసరమైన లోతుకు వెళ్లవచ్చు. ఒక్కోచోట భూమి స్వభావం ఒక్కోరకంగా ఉంటుంది. గోడ నిలబడాలంటే, నిర్మాణం దృఢంగా ఉండాలి. అందుకు తగ్గట్టుగా పునాది నిర్మించుకోవాలి. ప్రహరీ పునాది నాలుగు దిక్కులా సమాన లోతులో ఉండాలన్న నియమం ఏమీ లేదు. కొన్ని వైపుల రాయి రావచ్చు. అలాంటి చోట పునాది ఎక్కువ లోతు తీయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అలాగే, బేస్‌మెంట్‌ లేకుండా ప్రహరీ కట్టవద్దు. గోడలు నేల లోపలినుంచి పైకి వచ్చేలా ఉండాలి. అందుకు తగ్గట్టుగా పునాది తవ్వాల్సి ఉంటుంది.

మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్‌ నం: 10, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ – 500034.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana