కొన్ని అక్షతలు పసుపు గణపతిపై చల్లి నమస్కరించాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు తథాస్తు.
(ఈ కింది విధంగా జపిస్తూ గణనాయకుడికి నమస్కరించాలి)
శ్లో॥ సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః,
ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కంధపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి.. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
(..అని అనుకొని కొన్ని అక్షతలు పసుపు గణపతిపై వెయ్యాలి.)
ఆసనం సమర్పయామి (పువ్వులను పసుపు గణపతి వద్ద ఉంచి, కింది మంత్రం చదువుతూ నీళ్లు సంప్రోక్షించాలి)
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ఉపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి (దూదితో చేసిన వస్త్రమును లేదా పుష్పాన్ని సమర్పించాలి), గంధాన్ సమర్పయామి (గంధాన్ని చల్లాలి), గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లాలి)
పుష్పైః పూజయామి (పుష్పాలను ఉంచాలి) తరువాత గణేశునిపై ఒక్కో పుష్పాన్ని వేస్తూ ఈ కింది మంత్రంతో అర్చించాలి.
ఓం సుముఖాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వికటాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం శూర్పకర్ణాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి.
ధూపం ఆఘ్రాపయామి (అగరుపుల్లలను వెలిగించి స్వామికి ధూపం వెయ్యాలి), దీపం దర్శయామి (దీపమును చూపించాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీళ్ళు చిలకరించాలి), ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరం వెలిగించాలి)
శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా॥
మహాగణాధిపతియే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు, మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. (గణపతి దగ్గరున్న అక్షతలను తీసుకొని తలపై చల్లుకోవాలి).
(కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి)
ఆవాహనం శ్లో॥ అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ, గౌరీగర్భ సముద్భవ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి)
ఆసనం శ్లో॥ మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్న సింహాసనం చారుప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నవరత్న ఖచిత స్వర్ణసింహాసనార్థం-హరిద్రాక్షతాన్ సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేశుని చేతులపై నీళ్ళు చల్లాలి)
అర్ఘ్యం శ్లో॥ గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేషుని పాదాలపై నీళ్ళు చల్లాలి)
పాద్యం శ్లో॥ గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీ వరసిద్ధ్ది వినాయకాయ నమః
పాదయోః పాద్యం సమర్పయామి
శ్లో॥ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ముఖేః శుద్ధ ఆచమనీయం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ ఆవు పాలు, పెరుగు, నెయ్యిలతో కూడిన మిశ్రమాన్ని సమర్పించాలి)
శ్లో॥ దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణమిదం గజవక్త్ర నమోస్తుతే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
మధుపర్కం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పంతో స్వామిపై పంచామృతాలు చిలకరించాలి)
శ్లో॥ స్నానం పంచామృత్తెర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణీ గణపూజితః॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
పంచామృత స్నానం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పంతో నీటిని రెండుసార్లు స్వామిపై చల్లాలి)
శ్లో॥ గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైః అమలైర్జలైః
స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి.
స్నానానంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ పత్తితో చేసిన వస్ర్తాన్నిగానీ, రెండు పుష్పాలను గానీ వినాయకుడికి సమర్పించాలి)
వస్త్రం శ్లో॥ రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణత్వం, లంబోదర హరాత్మజ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
వస్త్రయుగ్మం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామికి వెయ్యాలి)
శ్లో॥ రాజితం బ్రహ్మ సూత్రం చ కాంచనంచోత్తరీయకం
- గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్ట దాయక॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
యజ్ఞోపవీతం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పంతో గంధాన్ని స్వామిపై వెయ్యాలి)
గంధం శ్లో॥ చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
దివ్య శ్రీ చందనం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ అక్షతలు స్వామిపై వెయ్యాలి)
అక్షతలు శ్లో॥ అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
అలంకరణార్థం హరిద్రాక్షతాన్ సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పాలు స్వామిపై వెయ్యాలి)
పుష్పములు- శ్లో॥ సుగంధాని చ సుపుష్పాణీ జాజీకుంద
ముఖానిచ – ఏకవింశతి పత్రాణి
సంగృహాణ నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
పుష్పాణి పూజయామి