తాజ్‌మహల్‌ను చూస్తాం. మహా అయితే ఫొటో తీసుకుంటాం. ఓ అడుగు ముందుకేసి.. ఆ నమూనాను తెచ్చి షోకేస్‌లో పెట్టుకుంటాం. కానీ, చార్మినారే ఓ అల్మెరాగా మారితే? కుతుబ్మినారే మన బుక్‌షెల్ఫ్ అవతారం ఎత్తితే? ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఇదే నయా ట్రెండ్!
ఒక్కొక్కరిది.. ఒక్కోరకమైన అభిరుచి. కొందరికి గార్డెనింగ్ ఇష్టమైతే, మరికొందరు ఇంటీరియర్ డిజైనింగ్‌కు ఓటేస్తారు. పాతకు జాతర చేస్తూ.. ఇంట్లో పాతకాలం వాచీలు, టెలిఫోన్లు, రేడియోలు
షోకేస్‌లో పెట్టుకునేవారి సంఖ్యా తక్కువేం కాదు. అలా ఇప్పుడు మన దేశంలో కొత్త ట్రెండ్ మొదలైంది. స్మారక కట్టడాలను తలపించే ఫర్నిచర్‌ను జనం ఇష్టపడుతున్నారు. మొజాయిక్ క్రియేషన్స్‌తో మంచి పేరు సంపాదించుకున్న ఇటాలియన్ బ్రాండ్.. సైసిస్. ఈ బ్రాండే ప్రస్తుతం ఢిల్లీ, ముంబై నగరాల్లో కొత్తగా హోమ్ కలెక్షన్ తీసుకొచ్చింది. ఇందులో ఇటలీలోని స్మారక కట్టడాలు అనేకం ఉన్నాయి. ఈ మాస్టర్ పీస్‌లను కలపతో తయారు చేస్తున్నారు. లోపలి భాగాల్లో అద్దాలు, ఇత్తడి అమర్చుతున్నారు. తలుపు తెరిచినప్పుడు లోపలి సెన్సర్ అలర్ట్ అవుతుంది. ఎల్యీడీ లైట్లు ఠక్కున వెలుగుతాయి. వైన్ క్యాబినెట్లో అయితే, ప్రత్యేకంగా వైన్ కూలర్ ఆప్షన్ ఉంటుంది. కొన్ని సంస్థలు తాజ్‌మహల్, చార్మినార్, ఏకశిలారథం నమూనాలలోనూ ఫర్నిచర్‌ను తయారు చేస్తున్నాయి. బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇవి బావుంటాయి. చరిత్రను ప్రేమించడం అంటే.. ఇలాంటి అపురూప వస్తువులను జీవితంలో భాగం చేసుకోవడమే!