ఆరు పాదాలతో నూరు భావాలను పలికించే అందమైన సాహితీ ప్రక్రియ కైతికాలు. వాటికి తెలంగాణ భాష తోడైతే ఆ కవితల పరిమళం గునుగుపూలు గుబాళించినట్టు ఉంటుంది. తన జీవితానుభవాలనే కవితా వస్తువుగా ఎంచుకొని ‘గున్కపూలు’ సంపుటిని అందంగా ఆవిష్కరించారు రచయిత.
రచన: అల్లాడి శ్రీనివాస్
పేజీలు: 55, వెల: రూ.50
ప్రతులకు: 83416 63982
విష్ణుమూర్తి
తెలంగాణ సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాత కూడా. ఉద్యమ స్ఫూర్తితో స్వరాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిలోని మనీషిని అందమైన కవితలతో అర్చించాడు రచయిత.
రచన: డి.మహాధర్
పేజీలు: 96, వెల: రూ.166
ప్రతులకు: 73997 71199
మనుషులమై బ్రతకాలి
మనిషిని మనిషిలా బతకమని తట్టిలేపే కవితలివి. కులమతాల సంకులత్వాన్ని ప్రశ్నిస్తూ, వలస బతుకుల వెతలు కండ్లకు కడుతూ, గంగానది దిగులుకు కారణాలు ఎండగడుతూనే, మనిషి కర్తవ్యాన్ని తన కవితల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు పుస్తక రచయిత.
రచన: డా॥కె.దివాకరా చారి
పేజీలు: 144, వెల: రూ.100
ప్రతులకు: 93910 18972
పాలపిట్ట బుక్స్: 040-2767 8430