‘ఏహ్! మీకు చెప్పుడు, సవరిచ్చుడు నాతోని కాదు. వాడు ఎనకేత్తంటె, నువ్వు గాయిగాయిగ ఖర్సు పెడ్తుంటవ్. లెక్కలేదు, పత్రం లేదు. మీకత ‘పోశమ్మ కూడబెడితే, మైసమ్మ మాయం జేసినట్టుంది’. నాతోని కాదీ పంచాతి’ అంటుంటారు. ఒకరు చెమటోడ్చి కూడబెట్టిన డబ్బును, మరొకరు జల్సాల కోసం ఖర్చు చేసినప్పుడు ప్రయోగించే సామెత ఇది. ‘సొమ్మొ
కరిది, సోకొకడిది’, ‘కొమ్రన్న కూడవెడ్తే.. మల్లన్న మాయం జేసినట్టు’, ‘దాసి, దాసి దెయ్యాల పాల్జేసినట్టు’ వంటివి కూడా వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్నాయి.