పుణుకుడు = నిమరడం (పాదయాత్రల ఆయిన అందరి సెంపలు పుణికిండు!)
గప్పాలు = లేనిపోని గొప్పలు (వాడేమి గప్పాలు కొడ్తుండురా? తెల్వనోడు వింటె నివ్వద్దే ననుకుంటడు)
పుట్టిచ్చిన = కల్పించిన (వాడు చెప్పేటియి అన్నీ పుట్టిచ్చిన ముచ్చట్లు, అవద్దాలు)
కంటు = పగ, శత్రుత్వం (నీ నోరు ఊకుండదార పోరడా? ఎప్పుడు ఎవన్నో ఒకన్ని తిడ్తనే ఉంటవు. అందరికి ‘కంట’యితవు)
లాశి = బిగ్గరగా (ధ్వని విషయంలో వాడుతరు) ‘నువ్వు చెప్పేది ఏం వినపడ్త లేదు, జెరంత లాశిగా చెప్పు’