వ్యవసాయ పరిభాషలో నిత్యం వాడే పలుకుబడి ‘ఆయిటి పూనింది.. సెరువు నిండింది’. ఇది పల్లెల్లో ఎక్కువగా వినిపిస్తది. ఈ పదబంధంలో ఆయిటి పూనడం అంటే వర్ష్షకాలం మొదలవడం. అసలు పదం ‘ఆగిటి’ అంటే వ్యవసాయానికి అనుకూల వర్షసూచిక. ఇది పక్కా తెలంగాణ పదం. గ్రీష్మం తర్వాత ఆకాశం మేఘావృతం కావడమే ‘ఆయిటి పూనడం’. ఆయిటి పూని వర్షాలు మెండుగా కురిస్తే.. చెరువులు, బావులు నిండి ఎవుసం ఆనందంగా సాగుతుంది.
‘ఆయిటి పూనింది.. సెరువు నిండింది. ఇంకెందుకాలస్యం.. దుక్కులు దున్ని, ఇత్తులు పెట్టడమే’ అంటూ గ్రామాల్లో వ్యవసాయదారులు విరివిగా, సులువుగా ఉపయోగించే పదమిది.