మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 08, 2020 , 17:06:26

నాన్నకు ప్రేమతో.. ధోనీ బర్త్‌డే పాటపాడిన జీవా

నాన్నకు ప్రేమతో.. ధోనీ బర్త్‌డే  పాటపాడిన  జీవా

రాంచి: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మంగళవారం 39వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు.  మహీ  జన్మదినం సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌,  గంగూలీ,  వీవీఎస్‌ లక్ష్మణ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మతో పాటు  సెలబ్రిటీలు, అభిమానులు  శుభాకాంక్షలు తెలిపారు.  

సోషల్ మీడియాలో తన ఆట పాటలతో సందడి చేస్తోన్న ధోనీ కుమార్తె   జీవా  సెలబ్రిటీగా మారిపోయింది.  చిన్న వయసులోనే   స్పష్టంగా పాట పాడుతోంది. ధోనీ బర్త్‌డే సందర్భంగా  జీవా ఇంగ్లీష్‌లో పాట పాడడం సెన్సేషనల్‌గా మారింది.  ధోనీతో  జీవా ఉన్న ఫొటోలతో ఈ వీడియోను  రూపొందించారు.  జన్మదిన శుభాకాంక్షలు నాన్న!  ఇది  నాన్న కోసం.. ఐ లవ్‌ యూ!!  అంటూ జీవా సింగ్‌ ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

View this post on Instagram

This is for my Papa ! @mahi7781 I love you ❤️

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo