బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 23, 2020 , 02:58:32

మీరు చూసే కోహ్లీ వేరు: జంపా

మీరు చూసే కోహ్లీ వేరు: జంపా

సిడ్నీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో ఉన్న విధంగా బయట ఉండడని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో విరాట్‌ సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన జంపా మాట్లాడుతూ.. ‘దుబాయ్‌లో దిగిన తొలిరోజే కోహ్లీ వాట్సాప్‌లో మెసేజ్‌ చేశాడు. అతడి నంబర్‌ నా దగ్గర లేదు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడాడు. గ్రౌండ్‌లో కనిపించే కోహ్లీకి బయట ఉండే అతడికి అసలు సంబంధమే లేదు. ప్రత్యర్థులపై పోటీని అతడు ఆస్వాదిస్తాడు. మైదానం బయటకు వచ్చాడంటే అందరితో కలిసిపోతాడు. బస్సులో ప్రయాణించేటప్పుడు యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ గట్టిగా నవ్వుతాడు. అందరిలాగే విరాట్‌కు ఓటమంటే నచ్చదు. దాన్ని మిగతావారి కంటే కాస్త ఎక్కువగా ప్రదర్శిస్తాడంతే’ అని చెప్పుకొచ్చాడు.