సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 23, 2020 , 11:00:07

ఆండర్సన్‌ సూపర్‌ .. 24/3తో కష్టాల్లో పాకిస్థాన్‌

 ఆండర్సన్‌ సూపర్‌ .. 24/3తో కష్టాల్లో  పాకిస్థాన్‌

సౌతాంప్టన్‌: పాకిస్థాన్‌తో మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ అన్ని విభాగాల్లోనూ సత్తాచాటింది. రెండోరోజు పూర్తిగా ఇంగ్లాండ్‌ ఆధిపత్యమే కొనసాగింది.  అటు బ్యాటింగ్‌లో దంచేసి.. బౌలింగ్‌లోనూ మెరిసిన ఇంగ్లాండ్‌  నిర్ణయాత్మక మూడో టెస్టులో  రెండో రోజే మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. ఇంగ్లీష్‌ సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(3/13) ధాటికి టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఆండర్సన్‌ బుల్లెట్‌ లాంటి బంతులతో రెచ్చిపోయాడు. రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టాడు.

పాక్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే  ముగ్గురు బ్యాట్స్‌మెన్‌  షాన్‌ మసూద్‌(4), అబిద్‌ అలీ(1), బాబర్‌ అజాం(11)  పెవిలియన్‌ పంపి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.  రెండోరోజు ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 10.5 ఓవర్లు ఆడిన పాక్‌ 3 వికెట్లు చేజార్చుకుని 24 పరుగులే చేసింది. ఇంగ్లాండ్‌ స్కోరుకు పాక్‌ 559 పరుగులు వెనకబడే ఉంది.  ప్రస్తుతం కెప్టెన్‌ అజహర్‌ అలీ(4) క్రీజులో ఉన్నాడు. 


logo