ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 04, 2021 , 16:15:38

భారత్‌తో టెస్టు సిరీస్‌..జారిపడ్డ క్రికెటర్‌..రెండు టెస్టులకు దూరం

భారత్‌తో టెస్టు సిరీస్‌..జారిపడ్డ క్రికెటర్‌..రెండు టెస్టులకు దూరం

చెన్నై: భారత్‌తో తొలి రెండు టెస్టులకు అత్యుత్తమ జట్లను ఎంపికచేయలేదని ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ జాక్‌ క్రాలే గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరంకానున్నాడు. 23ఏండ్ల జాక్‌ క్రాలే కుడి మణికట్టుకు గాయం కావడంతో చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది.  

శుక్రవారం నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు ఆరంభంకానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌ ప్రాక్టీస్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట క్రాలే ఫ్లోర్‌పై జారిపడటంతో అతడి మణికట్టుకు గాయమైంది.  23 ఏళ్ల క్రాలీ, శుక్రవారం చెన్నైలో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు శిక్షణ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ వెలుపల పాలరాయి అంతస్తులో జారిపోయాడు.

క్రాలే కుడి మణికట్టు బెణికిందని స్కానింగ్‌లో నిర్ధారణ అయిందని, అతడు తీవ్రనొప్పితో బాధపడుతున్నాడని ఇంగ్లాండ్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. మరొకొన్ని వారాల పాటు అతని గాయాన్ని ఇంగ్లాండ్‌ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షించనుంది.  

VIDEOS

logo