బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 27, 2020 , 14:51:32

తండ్రితో చాహల్‌ ఫన్నీ టిక్‌టాక్‌ వీడియో

తండ్రితో చాహల్‌ ఫన్నీ టిక్‌టాక్‌ వీడియో

ముంబై: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19)  ఇప్పటికే పలు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు రద్దు కాగా ప్రస్తుతం జరగాల్సిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లను ఆయా దేశాలు రద్దు చేసుకున్నాయి. భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వా ఆదేశాలకు అనుగుణంగా ఐపీఎల్‌ను కూడా వాయిదా వేశారు. కరోనాతో దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. అత్యవసర సేవలందించే వాళ్లు మినహా దేశప్రజలందరూ ఇళ్లకే పరిమితయ్యారు. ఖాళీ సమయంలో కొంతమంది క్రికెటర్లు ఇంటి పనులు చేస్తూ, కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. మరికొంతమంది ఆన్‌లైన్‌లో సినిమాలు, వీడియో గేమ్‌లు, టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ  కాలక్షేపం చేస్తున్నారు. 

తాజాగా భారత యువ లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ తన తండ్రితో కలిసి టిక్‌టాక్‌ వీడియో చేశాడు. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న చాహల్‌ తన అభిమానుల కోసం టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ అలరిస్తున్నాడు. 'నాన్నతో ఫస్ట్‌ టిక్‌టాక్‌ వీడియో' చేశానని చాహల్‌ ట్వీట్‌ చేస్తూ టిక్‌టాక్‌ వీడియోను ట్విటర్లో పోస్ట్‌ చేశాడు. బేసిక్‌ డ్యాన్స్‌ మూమెంట్‌పై  ఫ్యాన్స్‌ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.   
logo
>>>>>>