శనివారం 16 జనవరి 2021
Sports - Dec 24, 2020 , 11:39:37

బ్యూటీఫుల్‌.. చాహ‌ల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు

బ్యూటీఫుల్‌.. చాహ‌ల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు

హైద‌రాబాద్‌: క్రికెట‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ కొన్ని రోజుల క్రిత‌మే త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ధ‌నాశ్రీ వ‌ర్మ‌ను పెళ్లి చేసుకున్నాడు.  అయితే ఇటీవ‌ల ధ‌నాశ్రీతో జ‌రిగిన ఎంగేజ్మెంట్ ఫోటోల‌ను తాజాగా చాహ‌ల్ బుధ‌వారం త‌న ఇన్‌స్టాలో రిలీజ్ చేశాడు.  ఎంగేజ్మెంట్ డే అద్భుత‌మ‌ని చాహ‌ల్ త‌న ఇన్‌స్టా ఫోటోలో పోస్టు చేశాడు.  అయితే లెగ్ స్పిన్న‌ర్ ఆ ఫోటోల‌ను పోస్టు చేసిన వెంట‌నే అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపించారు.  కొత్త క‌పుల్‌కు విషెస్ చెప్పారు. మాజీ క్రికెట‌ర్ బ్రియాన్ లారా కూడా ఆ ఫోటోల‌కు రియాక్ట్ అయ్యారు.  కంగ్రాట్స్‌.. జ‌స్ట్ బ్యూటిఫుల్ అని లారా  కామెంట్ చేశారు. దేశీయ క్రికెట‌ర్ల‌తో పాటు విదేశీ క్రికెట‌ర్లు అనేక మంది చాహ‌ల్ ఎంగేజ్మెంట్ ఫోటోల‌కు విషెస్ తెలిపారు. ఈ ఏడాది ఆగ‌స్టులో ఈ ఇద్ద‌రి ఎంగేజ్మెంట్ జ‌రిగింది.  ఆ త‌ర్వాత ఐపీఎల్ ఆడిన స్పిన్న‌ర్‌.. ఆస్ట్రేలియాలోనూ వ‌న్డేలు, టీ20ల్లో ఆడాడు.