మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 29, 2020 , 00:21:17

మిస్‌ యూ మహీభాయ్‌

 మిస్‌ యూ మహీభాయ్‌

హామిల్టన్‌: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని చాలా మిస్‌ అవుతున్నామని.. టీమ్‌ బస్సులో అతడి స్థానాన్ని అలాగే ఉంచామని భారత స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20 కోసం కోహ్లీ సేన బస్సులో హామిల్టన్‌కు వెళ్తున్న సమయంలో చాహల్‌ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ‘చాహల్‌ టీవీ’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో బుమ్రా, పంత్‌, రాహుల్‌తో సంభాషించిన చాహల్‌.. బస్సు చివరి సీటు వద్దకు చేరి ‘ఇది దిగ్గజం కూర్చునే స్థానం. అతడు మరెవరో కాదు మహీ భాయ్‌. అది అతడికి మాత్రమే సొంతం. అందుకే ఆ స్థా నంలో ఎవరూ కూర్చోవట్లేదు. అతడిని చాలా మిస్‌ అవుతున్నాం’ అని అన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. కాగా, వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 


logo
>>>>>>