సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 03, 2020 , 16:42:51

RCB vs RR: పోరాడుతున్న రాజస్థాన్‌

RCB vs RR: పోరాడుతున్న రాజస్థాన్‌

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌  పోరాడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ ఆదిలోనే వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఆ జట్టు పుంజుకునేందుకు బెంగళూరు బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు.

మిడిలార్డర్‌లో రాబిన్‌ ఉతప్ప(17) ఈ  మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న మహిపాల్‌ లామ్రోర్‌ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 13 ఓవర్లకు రాజస్థాన్‌ 4 వికెట్లకు 85 పరుగులు చేసింది. మహిపాల్‌(28), రియాన్‌ పరాగ్‌(9) క్రీజులో ఉన్నారు.