గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Mar 21, 2020 , 09:53:46

చాహ‌ల్‌తో మ‌జాక్ చేసిన బ్రిటీష్ మోడ‌ల్

చాహ‌ల్‌తో మ‌జాక్ చేసిన బ్రిటీష్ మోడ‌ల్

యుజ్వేంద్ర చాహాల్ ఎంత జాలీగా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న టీంమేట్స్‌ని ఇంట‌ర్వ్యూలు చేయ‌డ‌మే కాదు వారితో క‌లిసి అప్పుడప్పుడు టిక్ టాక్ వీడియోలు కూడా చేస్తుంటాడు. ఈ వీడియోలు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. తాజాగా  బ్రిటీష్ మోడ‌ల్ , సింగ‌ర్ ర‌మిత్ సంధు.. చాహ‌ల్‌ని ఆటప‌ట్టించిన వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతుంది.  చాహ‌ల్ షూ లేస్ క‌ట్టుకునేందుకు కాస్త బెండ్ అయ్యి లేచే లోగా, ఆయ‌న‌కి క‌న‌బ‌డ‌కుండా చుట్టూ తిర‌గ‌డం,  బుగ్గ‌ల‌ని లాగి లాంటి చిలిపి ప‌నులు చేసి అక్క‌డ నుండి పారిపోతుంది. ఆ స‌మ‌యంలో చాహ‌ల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ అదుర్స్ అంటున్నారు నెటిజ‌న్స్.  న్యూజిలాండ్ టూర్‌లో ఉన్న‌ప్పుడు చాహ‌ల్ త‌న టీంమేట్స్ శ్రేయాస్ అయ్య‌ర్‌, మ‌నీష్ పాండేల‌తో క‌లిసి ఓ టిక్ టాక్ వీడియో చేయ‌గా, దీనికి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

భార‌త జట్టులో కీ ప్లేయ‌ర్‌గా ఉన్న చాహ‌ల్ కీల‌క వికెట్స్ తీసి టీంకి అనేక సార్లు భారీ విజ‌యాలు అందించిన  విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌న్డేలు, టీ 20లు ఆడుతున్న చాహ‌ల్ త్వ‌ర‌లో రానున్న ఐపీఎల్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. logo