సోమవారం 18 జనవరి 2021
Sports - Nov 27, 2020 , 18:40:44

వన్డేల్లో చాహల్‌ చెత్త రికార్డు

వన్డేల్లో  చాహల్‌ చెత్త రికార్డు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో  టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ చెత్త రికార్డు నమోదు చేశాడు.  తొలి వన్డేలో చాహల్‌ పేలవ బౌలింగ్‌తో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 10  ఓవర్లు వేసి వికెట్‌ పడగొట్టిన చాహల్‌ 89 రన్స్‌ ఇచ్చాడు.   ముఖ్యంగా ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌(114), స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌(105) చాహల్‌ బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు. 

చాహల్‌ బౌలింగ్‌లో సిడ్నీ క్రికెట్‌ మైదానం నలువైపులా  భారీ షాట్లు ఆడారు.  వన్డే క్రికెట్‌లో ఓ భారత  స్పిన్నర్‌ అత్యధిక పరుగులు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. మార్కస్‌ స్టాయినీస్‌ వికెట్‌ మాత్రమే తీసిన చాహల్‌ 10-0-89-1 గణాంకాలు నమోదు చేశాడు.