శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 16, 2020 , 12:43:18

హిందీ డైలాగ్ చెప్ప‌లేక‌పోయిన క్రిస్ గేల్‌..!

హిందీ డైలాగ్ చెప్ప‌లేక‌పోయిన క్రిస్ గేల్‌..!

విధ్వంకర క్రికెటర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు  క్రిస్ గేల్. ఈ  కరేబియన్ వీరుడు ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... క్రీజ్‌లో నిలిచాడంటే బౌల‌ర్స్ గుండెల్లో వ‌ణుకు పుడుతుంది. షాట్ కొట్టాడంటే బంతి స్టేడియం అవతల ఉంటుంది. అయితే గ్రౌండ్‌లో త‌న బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టే క్రిస్ గేల్ స్టేడియం బ‌య‌ట మాత్రం ప‌లు చ‌మ‌త్కారాలు చేస్తుంటారు. రీసెంట్‌గా యువ‌రాజ్‌తో క‌లిసి క్రిస్ గేల్ చేసిన సంద‌డికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

భార‌త క్రికెట‌ర్ యువ‌రాజ్ త‌న ట్విట్ట‌ర్‌లో తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో క్రిస్ గేల్ .. యువ‌రాజ్ చెప్పిన హిందీ డైలాగ్‌ని అనుక‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. వెనుక నుండి యువ‌రాజ్ ప్రాంప్టింగ్ చేస్తున్నప్ప‌టికీ  మ‌ధ్య‌లో తిక‌మ‌క‌ప‌డి ఏదో చెప్పేస్తాడు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య న‌వ్వులు పూశాయి. క్రిస్ గేల్ చెప్పాల‌నుకున్న ఆ హిందీ డైలాగ్ ఏమంటే కాన్ఫిడెన్స్ మేరా ! క‌బ‌ర్ బ‌నేగీ తేరీ( నా ఆత్మ‌విశ్వాసంతో నీ చావుకి స‌మాధి క‌డ‌తా) . యువ‌రాజ్ షేర్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


 


logo