ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 26, 2020 , 16:56:49

‘ఆరు సిక్సర్ల తర్వాత బ్రాడ్ తండ్రి నాతో మాట్లాడారు ‘

‘ఆరు సిక్సర్ల తర్వాత బ్రాడ్ తండ్రి నాతో మాట్లాడారు ‘

లండన్​: 2007 టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్​లో తాను ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన విషయాన్ని టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ జరిగిన తర్వాతి రోజు స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్​ బ్రాడ్ తనతో మాట్లాడాడని యువీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “స్టువర్ట్ తండ్రి క్రిస్​ బ్రాడ్ మ్యాచ్ జరిగిన​ తర్వాతి రోజు నా దగ్గరికి వచ్చారు. నా కుమారుడి కెరీర్​ దాదాపు ముగిసేలా చేశావు, అతడి కోసం ఓ షర్టుపై సంతం చేసివ్వు అని అడిగారు. దాంతో నేను భారత జెర్సీపై సంతకం చేసి ఓ సందేశం రాసి ఆయనకు ఇచ్చా. ‘నేను ఆరుసిక్సర్లు కొట్టా. బౌలర్​గా నువ్వెలా ఫీలవుతావో నాకు తెలుసు. ఇంగ్లండ్ క్రికెట్ భవిష్యత్తు కోసం నీకు ఆల్​ ది బెస్ట్’ అని రాసిచ్చా” అని యువరాజ్ సింగ్ చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో బ్రాడ్​ ఒకడని యువీ ప్రశంసించాడు. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు సమర్పించిన తర్వాత ఇంత అద్భుతంగా అతడి కెరీర్ సాగుతుండడం మామూలు విషయం కాదని యువీ చెప్పాడు. 


logo